ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాక ప్రజల్లో ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే సీఎం కుటుంబ సభ్యుల గురించి, ఆస్తిపాస్తులు, వ్యాపారాల గురించి కూడా తెలుసుకోవాలనే కోరిక సామన్య ప్రజానీకంలో ఉండటంలో తప్పు లేదు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ కంపెనీలు తాజాగా దీనిపై నివేదిక విడుదల చేశాయి. దేశంలో ఎవరు అత్యంత సంపన్న ముఖ్యమంత్రో ప్రకటించాయి.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఉండే ఫాలోయింగ్, క్రేజే వేరు. ప్రజల్లో వారికి ఉండే గౌరవ, మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎంలు ఏం చేసినా స్పెషలే. అయితే వారి వ్యక్తిగత జీవితంలోని విశేషాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఉండటం కామనే. వారి ధనార్జన, వ్యాపారాలు, ఆస్తులు లాంటి అంశాలను తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. జగన్ ఆస్తుల విలువ రూ.510 కోట్లుగా ఉంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ అనే సంస్థ రిలీజ్ చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఇప్పుడు ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని స్పష్టమైంది.
సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ టాప్లో ఉండగా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆఖర్లో ఉన్నారు. దీదీ ప్రాపర్టీస్ వ్యాల్యూ కేవలం రూ.15 లక్షలేనని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించింది. భారత్లోని ముప్పై మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం.. అంటే 29 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.33.96 కోట్లుగా ఉంది. జగన్ తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.163 కోట్లతో రెండో పొజిషన్లో ఉన్నారు. రూ.63 కోట్లతో మూడో ప్లేసులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ ఆస్తులు రూ.23 కోట్లు అని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ పేర్కొంది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆస్తులు కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
Thread:
AndhraPradesh CM @ysjagan is the richest among 30 CMs of State Assemblies and Union Territories analysed, by @adrspeaks. @ysjagan owns assets worth Rs 510 Cr. He is closely followed by Arunachal Pradesh CM Pema Khandu with Rs 163 Cr & Naveen Patnaik-Rs 63 Cr ++
— @Coreena Enet Suares (@CoreenaSuares2) April 12, 2023