అనకాపల్లి జిల్లాలో కాబోయే భర్తకు సర్ ప్రైజ్ ఇస్తానని యువతి పీక కోసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. పెళ్లి ఇష్టంలేని యువతి.. ఇంటికొచ్చిన కాబోయే భర్తను ఫ్రెండ్స్ కు పరిచయం చేస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లినట్లు యువకుడు తెలిపారు. ఓ గుట్ట మీదకు తీసుకెళ్లిన తర్వాత చున్నీత తన కళ్లకు గంతలు కట్టి దారి మధ్యలో కొనుకొన్న కత్తితో పీక కోసినట్లు బాధితుడు ఆరోపించాడు. మే నెల 28న బాధితుడికి వివాహం జరగాల్సి ఉంది. ఇప్పటికే నిశ్చితార్థం అయిపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆమె ఎలా దాడి చేసిందనే విషయాన్ని ఈ కింది వీడియోలో బాధితుడు స్వయంగా వివరించాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.