అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి ఇష్టం లేని యువతి.. సర్‌ప్రైజ్ గిఫ్ట్ పేరుతో కాబోయే భర్తను పిలిపించుకుని.. అతడిపై కత్తితో దారుణంగా దాడి చేసి పరారయిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మే నెల 28న బాధితుడికి వివాహం జరగాల్సి ఉంది. ఇప్పటికే నిశ్చితార్థం అయిపోయింది. ఈ క్రమంలో సదరు యువతి.. కాబోయే భర్తని తన ఇంటికి పిలిపించుకుంది. ఆ తర్వాత ఏకాంతంగా మాట్లాడాలని.. ఇంటికి సమీపంలోని గుట్టపైకి తీసుకెళ్లి.. సర్‌ప్రైజ్ గిఫ్ట్ కళ్లు ముసుకోమని చెప్పి.. వెంట తెచ్చుకున్న కత్తితో అతడి గొంతు కోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇది కూడా చదవండి: అనకాపల్లిలో దారుణం.. కాబోయే భర్త గొంతు కోసిన యువతి
ఈ సందర్భంగా బాధితుడు.. ‘‘మీడియాతో మాట్లాడాడు. పెళ్లి నిశ్చయం అయిన నాటి నుంచి నేను తనను చాలా సార్లు అడిగాను.. ఈ పెళ్లి నీకిష్టమేనా అని. అందుకు తను నేనంటే చాలా ఇష్టం అన్నది. నిశ్చితార్థం అయ్యాక కలిసి సినిమాకు కూడా వెళ్లాం. ఇక ఈ సంఘటన జరిగిన రోజు.. అ అమ్మాయి నా గొంతు కోసి.. భయపడి ఏడుస్తూ.. తాను చనిపోతాను అన్నది. ఆ అమ్మాయి ఏమన్నా చేసుకుంటుంది ఏమో అని భయపడి.. నేనే బైక్ మీద తీసుకువచ్చాను’’ అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: మేలుకోకుంటే మనకూ శ్రీలంక గతేనా?
ఇక సదరు యువతి తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వినకుండా తమ పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువతికి వేరే ప్రేమ వ్యవహరం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు! ఈ ఒక్క నిర్ణయమే చివరికి విషాదాన్ని నింపింది!