ఆంధ్రప్రదేశ్ తిరుపతి రుయా ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. రోగులు పట్ల ఎంతో దయగా వ్యవహరించాల్సిన అంబులెన్స్ సిబ్బంది మానవత్వం మరిచి.. డబ్బులు కోసం రాక్షసంగా ప్రవర్తించారు. అసలే బిడ్డను పొగొట్టుకుని.. తీరని కడుపుకోత అనుభవిస్తున్న వారిని డబ్బుల కోసం పీడించారు. ప్రస్తుతం ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఆ వివరాలు..
తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటు ఓ బాలుడు మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలిసి.. అతడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వెంట వచ్చిన బంధువులు ఓదార్చి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకుళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆస్ప్రతి నుంచి బాధితుడి కుటుంబం 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్రమంలో ఆస్పత్రి అంబులెన్స్ సిబ్బంది.. మృతదేహాన్ని తరలించేందుకు 20 వేల రూపాయలు డిమాండ్ చేసింది. అంత మొత్తం ఇచ్చుకోలేమని.. కనికరించమని మృతుడి కుటుంబ సభ్యులు వేడుకున్నారు. కానీ అంబులెన్స్ సిబ్బంది సిండికేట్‌గా మారి.. తాము అడిగినంత ఇస్తేనే వస్తామని డిమాండ్ చేసింది.
దాంతో చేసేదేంలేక.. బాధితులు ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించుకున్నారు. కానీ రుయా అంబులెన్స్ సిబ్బంది.. ప్రైవేట్ అంబులెన్స్‌ని లోనికి రానివ్వలేదు. అంతటితో ఆగక.. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి చేశాడు. అసలే కొడుకును పొగొట్టుకున్న ఆ తండ్రి చేసేందేలేక.. మీద.. కుమారుడి మృతదేహాన్ని తీసుకుని.. బైక్ మీద.. 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఆస్పత్రి యాజమాన్యం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ అమానవీయ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Horrible incident @ #AndhraPradesh :
A father takes body of his son, who died of kidney failure, on a motorcycle to his village 90km away from #Tirupati
Private ambulance at #Ruia hospital, refused to reduce their high price. pic.twitter.com/R3bFgutZev
— Siddhu Manchikanti (@SiDManchikanti) April 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.