దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో సరైన సమయానికి అంబులెన్స్ డ్రైవర్లు స్పందించకపోవడం వల్ల రోగులు చనిపోయిన ఘటనలు ఎన్నో చూశాం.. కొన్ని చోట్ల డబ్బుకు కక్కుర్తి పడి చనిపోయిన వారిని తరలించేందుకు నిరాకరిస్తే.. కుటుంబీకులు బైక్ పై మృతదేహాలను తరలించిన ఘటనలు.. మరికొన్ని చోట్లు భుజాలపై చనిపోయిన వారిని మోసుకుంటూ ఇంటికి తీసుకు వెళ్లిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. ఇలాంటి వాటిపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించినా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలు మాత్రం ఆపలేకపోతున్నారు.
తిరుపతిలో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మరోసారి ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకం బయట పడింది. పాముకాటు తో చనిపోయిన ఒక బాలుడిని తీసుకు తీసుకు వెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్లు నిరాకరించడంతో బైక్ పై చనిపోయిన తన కొడుకును ఎక్కించుకొని ఇంటికి తీసుకు వెళ్లిన ఘటన అందరి హృదయాలను కలచి వేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
బసయవయ్య అనే బాలుడు పాము కాటుతో మృతి చెందాడు. చికిత్స కోసం కేవీబి పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. బాలుడి మృతదేమాన్ని ఇంటికి తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ సంప్రదించగా ఎవరూ ఆ మృతదేహాన్ని తీసుకు వెళ్లేందు ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక టూ విలర్ పైనే మృతదేహాన్ని ఎక్కించుకొని ఇంటికి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి : కన్నీరు పెట్టిస్తోన్న సూసైడ్ నోట్: అమ్మా నాన్న.. ఐ లవ్ యూ.. నాకిక పోరాడే ఓపిక లేదు!