దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా.. రోడ్డు భద్రతా చర్యలు చేపట్టినా కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి, అతి వేగం, నిద్ర లేమితో డ్రైవర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
నంద్యాల జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొంది. స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అప్పటి వరకు సంతోషంగా అందరూ భక్తితో దైవ దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణం అయ్యారు.. కానీ అంతలోనే విధి వక్రించింది. స్కార్పియో వాహనం కల్వర్టును ఢీ కొట్టడంతో వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, సామ్రాజ్యమ్మలు అక్కడికక్కడే మరణించారు.
మృతి చెందిన వారు కడప జిల్లా మైదుకూరుకు చెందిన వారిగా గుర్తించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్కార్పియో ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.