ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం సంచలనంగా మారింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీకి భారీ షాక్ తగిలింది. సొంత ఎమ్మెల్యేలే జగన్‌కు నమ్మకద్రోహం చేశారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు.. కొంత కాలం నుంచి పార్టీపై వ్యతిరేకత కనబరుస్తూ.. బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వారు వైసీపీకి ఓటు వేయలేదు అంటే నమ్మవచ్చు. కానీ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం.. నమ్మకంగా ఉంటూనే నట్టెటా ముంచారు. వారే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. వీరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అంటే.. కుటుంబ సమస్యల కారణంగానే పార్టీతో విభేదిస్తున్నారు. కానీ అనూహ్యంగా వీరి జాబితాలో ఉండవల్లి శ్రీదేవి చేరడం సంచలనంగా మారింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై ఇప్పటికే వైసీపీ అనర్హత వేటు వేసింది. అయితే తాను పార్టీకి ద్రోహం చేయలేదని శ్రీదేవి చెప్పుకొస్తుంది. కానీ ఆమె మాటలు ఎవరూ నమ్మడం లేదు. ఈ వివాదం ఇలా ఉండగా.. తాజాగా శ్రీదేవికి సంబంధించిన పాత వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిలో ఆమె గుండె.. జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అన్న వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ.. నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో 3 సంవత్సరాల క్రితంది. దీనిలో శ్రీదేవి అసెంబ్లీలో వైసీపీ సర్కార్ తీసుకువచ్చిన పథకాల గురించి వివరిస్తుంటుంది.
అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు ప్రభుత్వం అందరికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది అని ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీలో వివరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆరోగ్య శ్రీ ద్వారా.. ఆగి పోయిన గుండె.. బైపాస్ సర్జరీ తర్వాత మళ్లీ కొట్టుకుంటే.. అది లబ్ డబ్ అని కాకుండా.. జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అని తెలిపారు. అలానే జగన్ నియోజకవర్గం పులివెందుల గురించి ప్రస్తావిస్తూ.. పులి లాంటి జగన్ అన్న పుడతాడని ముందే ఊహించి.. ఆ ఊరికి పులివెందుల అని పేరు పెట్టారంటూ ప్రశంసలు కురిపించారు. క్రాస్ ఓటింగ్ ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత.. ఈ వీడియోలను మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి శ్రీదేవి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.