ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ డేటా సెంటర్ ద్వారా మొత్తంగా దాదాపు 50 వేల మందికి ఉపాధి లభించనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు శుంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతి పెద్దదైన ఈ డేటా సెంటర్ ద్వారా ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ పరంగా రాష్ట్రాన్ని మరో అడుగు ముందుకు వేసేలా చేసిందని చెప్పొచ్చు. అదాని డేటా సెంటర్ కారణంగా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి. కేవలం టెక్నాలజీ పరంగా అభివృద్ది సాధించటమే కాకుండా.. భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. టెక్నాలజీ పరంగా రాష్ట్రాన్ని దేశంలో ముందు వరుసలో ఉంచనున్న డేటా సెంటర్ గురించిన పూర్తి వివరాలు ఇవే..
అదాని గ్రూపునకు సంబంధించిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ మొత్తం 21,844 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో నిర్మింపబడనుంది. 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల డేటా సెంటర్, టెక్నాలజీ పార్క్ ఏర్పాటు కానుంది. అంతేకాదు! అతి త్వరలో 7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ పార్కు అభివృద్ధి కానుంది. తద్వారా ప్రత్యక్షంగా 39,815 మందికి.. పరోక్షంగా 10,610 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
అదాని డెటా సెంటర్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారనున్నాయి. డేటా హబ్‌తో డేటా స్పీడ్ గణనీయంగా పెరగనుంది. సింగపూర్ నుండి విశాఖపట్నం వరకు సముద్ర సబ్ మెరైన్ కేబుల్ ఏర్పాటు కానుంది. దీంతో ఇంటర్‌నెట్ స్పీడు 5 రెట్లు పెరగనుంది. హై ఇంటర్‌నెట్ స్పీడు కారణంగా ఐటీ సంస్థల ఏర్పాటుకు మార్గం సులభతరం అవుతుంది. వైజాగ్‌లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయటం వల్ల ఐటీతో పాటు దాని అనుబంధ సంస్థల అభివృద్ధి జరగనుంది. డేటా భద్రత, సర్వీసులకు సంబంధించిన ఖర్చులు తగ్గనున్నాయి. డేటా సెంటర్‌తో పాటు ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్శిటీ, స్కిల్ సెంటర్‌ల కారణంగా యువతలో నైపుణ్యం పెరగనుంది. మరి, అదాని డెటా సెంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.