వైసీపీ పాలనపై నటుడు భాను చందర్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. అయితే వైఎస్ జగన్ మోహన్ ముఖ్యమంత్రి కాక ముందు నుంచే నటుడు భాను చందర్ జగన్ కు సపోర్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా అప్పట్లో జగన్ చేపట్టిన పాదయాత్రలో సైతం పాల్గొన్న భాను చందర్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారని మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ తర్వాత ఇంత ప్రజాదరణ చూరగొన్న నేతను తాను చూడలేదని జగన్ పై పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా భాను చందర్ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించారు. ప్రతి మనిషి ఇంట్లో మా నాన్న ఫోటో ఉంది, ప్రతి మనిషి గుండెల్లో నేను కూడా ఉండాలి అనే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu: వైకాపా పాలనపై మహానాడులో తీవ్రస్థాయిలో విరుచుకుపడిన చంద్రబాబు!
జగన్ ముఖ్యమంత్రి అయి మూడు ఏళ్లే అవుతుందని, ఇప్పుడే విమర్శించడం కరెక్ట్ కాదని భాను చందర్ అభిప్రాయపడ్డారు. తాజ్ మహల్ ఒకే రోజులో నిర్మించలేదని, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి కావాలంటే కాస్త సమయం పడుతుందని భాను చందర్ తెలిపారు. ఇక ముందు ముందు ఏపీ బంగారు భవిష్యత్ కావాలంటే అంటే పునాది కావాలని దానికి కాస్త సమయం పడుతుందని నటుడు భాను చందర్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. జగన్ మంచోడని అతనికి ఇంకా పదేళ్లు అవకాశం ఇవ్వాలని కూడా భాను చందర్ కోరాడు. తాజాగా వైసీపీ పాలనపై భాను చందర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.