అలీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. చైల్డ్ ఆరిస్టుగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన అలీ..తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తోన్నారు. కమెడియన్ గా, హీరోగా అలీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాందించుకున్నారు. ఓ వైపు సినిమాలో కనిపిస్తూనే బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. అలా వెండితెర, బుల్లితెరలపై ఓ వెలుగు వెలుగుతున్న అలీ.. రాజకీయాల్లోను తన సత్తా చాటుతున్నారు. 2019 కి ముందు వైసీపీలో చేరిన అలీ.. పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన జగన్ ప్రభుత్వం.. తాజాగా అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానికి మీడియా సలహాదారుగా నియమించారు. అయితే ఈ పదవి రావడంపై అలీ ఎంతో సంతోషం వ్యక్తంచేశారు. తన కూతురి పెళ్లికి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన బహుమతిగా ఈ పదవిని భావిస్తున్నట్లు అలీ దంపతులు తెలిపారు.
2019 ముందుకు వైసీపీ లో చేరిన నటుడు అలీ.. పార్టీ విజయం కోసం చాలా కృషి చేశారు. ఈక్రమంలో జగన్ మెహన్ రెడ్డి సీఎం అయిన తరువాత అలీకి ఏదో ఒక కీలక పదవి ఇస్తారని అందరు భావించారు. ఒకానొక్కదశలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అనంతరం రాజ్యసభ, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వంటి పదవులు వస్తాయని వార్తలు వినిపించాయి. ఇలా మూడేళ్లు పాటు అనేక ప్రచారాలు జరిగాయే తప్ప అలీకి ఎలాంటి పదవీ రాలేదు. అయితే ఎట్టకేలకు తాజాగా జగన్ ప్రభుత్వం అలీకి కీలక పదవి కట్టబెట్టింది. ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఆయనను నియమించారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు. ఆయన జీత భత్యాలకు,అలవెన్సులకుసంబంధించిన విషయాలను మరోసారి ఉత్తర్యూలు ఇస్తామని జీవోలో పేర్కొన్నారు.
కాగా తనకు మీడియా సలహాదారుడిగా నియమించడంపై నటుడు అలీ స్పందించారు. ఎలక్ట్రానికి మీడియా సలహాదారుడిగా నియమించినందుకు సీఎం జగన్ కు అలీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ గారు ఇచ్చిన ఈ పదవిని న్యాయం చేస్తానంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన కూతురు పెళ్లి సందర్భంగా వైఎస్ జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తునానని అన్నారు. ఇక ఆలీ మాట్లాడుతూ..” నేను వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే జగన్ గారికి నా ఉద్దేశాన్ని స్పష్టంగా తెలిపాను. పదవుల కోసం పార్టీలోకి రాలేదన్న విషయాన్ని ఆయనకు తెలిపాను. అయితే నా పదవి గురించి గతంలో మీడియాల్లో పలు రకాల వార్తలు వచ్చాయి. దీనిపై నేను కూడా క్లారిటీ ఇచ్చాను. అయితే నా గురించి జగన్‌కు తెలుసు. అందుకు నిదర్శనమే ఈ పదవి”అని అలీ అన్నారు. కాగా అలీ సతీమణి జుబేదా కూడా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.