నేడు జనాభా విపరీతంగా పెరిగిపోయింది. విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలోనే సంపాదన పెరిగి.. నివాసాల కో్సం అడవులను, చెట్లను తొలిచి కట్టుకోవాల్సిన పరిస్థితి. రుగుతున్న వాతావరణ మార్పుల దృష్ట్యా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత, వడగాలులకు ఉండలేని పరిస్థితి. ఫ్యాను నుండి కూలర్, కూలర్ నుండి ఏసీకి వస్తువులు అత్యాధునికతను సంతరించుకున్నాయి. అదే సమయంలో
పూర్వీకుల కాలంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, పైరు, సెలయేళ్లు, చెరువులు, కొండ కోనలు ఉండేవి. పొద్దున ఎలా ఉన్నా సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి.. చిమ్మ చీకటి ఉండేది. విద్యుత్ లేని సమయంలో అయితే ఆరు బయట మంచాలు వేసుకుని పడుకునేవారు. చల్లటి గాలికి హాయిగా ప్రాణం ఏటో పోయినట్లు ఉండేది. నిద్ర పట్టేసేదని పెద్దలు చెబుతుంటారు. ఇక వేసవి కాలంలో అయితే విసన కర్రలు తీసుకుని విసురుకుని పడుకునేవారు. కానీ నేడు జనాభా విపరీతంగా పెరిగిపోయింది. విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలోనే సంపాదన పెరిగి.. నివాసాల కో్సం అడవులను, చెట్లను తొలిచి కట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో కుగ్రామాలు.. గ్రామాలుగా, తర్వాత నగరాలు, పట్టణాలుగా ఏర్పడ్డాయి. దీంతో వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. పెరుగుతున్న వాతావరణ మార్పుల దృష్ట్యా ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత, వడగాలులకు ఉండలేని పరిస్థితి. ఫ్యాను నుండి కూలర్, కూలర్ నుండి ఏసీకి వస్తువులు అత్యాధునికతను సంతరించుకున్నాయి.
ప్రస్తుతం ప్రతి ఇంట్లోనే ఏసీ ఉండాల్సిందే. లేదంటే నిద్ర పట్టడం, పోవడం కష్టమైపోతుంది. రాత్రి నిద్రలేమితో బాధపడలేక.. సగటు మానవుడు కూడా ఏసీ వంటి వస్తువును ఏర్పాటు చేసుకుంటున్నాడు. కానీ ఈ వస్తువు ప్రాణాలను హరించేస్తుంది. తాజాగా ఓ మహిళ ప్రాణం పోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దామర్ల శ్రీదేవి అనే మహిళ తన కముారుడు సాయితేజతో కలిసి జిల్లాలోని చీమకుర్తి పట్టణంలోని పల్లపోతువారి వీధిలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త నాలుగేళ్ల కిందట చనిపోవడంతో ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం రాగా.. ఒంగోలు జడ్పీ కార్యాలయంలో పీఎఫ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజులానే ఆదివారం కూడా రాత్రి శ్రీదేవి.. కుమారుడు.. తమ గదిలో ఏసీ వేసుకుని నిద్రపోయారు.
అయితే అధిక వోల్డేజీతో విద్యుత్ సరఫరా కావడంతో ఏసీ తీగలు కాలి.. ఒక్కసారిగా పేలిపోయింది. నిద్ర మత్తులో ఉన్న వీరిద్దరూ దీని నుండి వెలువడిన వాయువులను పీల్చి అపస్మారక స్థితిలోకి వెఃళ్లిపోయారు. ఆమె నివాసం నుండి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై. శ్రీదేవీ, సాయి తేజలను ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు ఆసుపత్రిలో తల్లీకుమారులిద్దరూ చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించి శ్రీదేవి మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆమె కుమారుడు సాయితేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.