ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొంతమది రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, పిడుగు పాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు అకస్మాత్తుగా కానరాని లోకానికి వెళ్లిపోతారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాలు.. కొన్నిసార్లు ప్రకృతి వైపరిత్యాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కొంత మంది యువకులు క్రికెట్ ఆడుతుండగా అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఓ యువకడు కన్నుమూశాడు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విజయనగరం జిల్లా గాజులరేగ గ్రామంలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతున్నారు. అప్పటి వరకు అంతా హ్యాపీగా ఉన్న సమయంలో ఒక్కసారే పిడుగు పడింది. పిడుగు ప్రభావానికి ఇజ్రాయిల్ (22) అనే యువకుడు అక్కడిక్కడే చనిపోయాడు. అఖిల్, సురేష్ అనే మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రేపు కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం చిత్తూరు వెళ్లాల్సి ఉండగా ఇంతలోనే మృత్యువు పిడుగు రూపంలో వచ్చి కబలించింది.
పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం సంపాదించి ప్రజలకు సేవ చేయాలని భావించిన ఇజ్రాయిల్ అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మరోవైపు ఏపీలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు పడుతున్నాయి. పిడుగులు, వడగండ్ల వర్షం వస్తుందని.. ఎవరూ అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.