శ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో పారా గ్లైడింగ్ లో శిక్షణ తీసుకుంటుండగా.. పారాచూట్ తెరుచుకోకపోవడంతో కొన్ని అడుగుల ఎత్తులో నుండి కిందకు పడిపోయిన జవాన్ చందక గోవింద్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య పూర్తి అయ్యాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
దేశం కోసం సేవ చేయాలి, దేశ సేవ కోసం ఎంతటి రిస్కు చేయడానికైనా సిద్దమే అన్న జవాన్.. శిక్షణలో ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని పర్లకు చెందిన చందక గోవింద్.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాలో పారా గ్లైడింగ్ లో శిక్షణ తీసుకుంటుండగా.. పారాచ్యూట్ తెరుచుకోకపోవడంతో కొన్ని అడుగుల ఎత్తులో నుండి కిందకు పడిపోయారు. సమీపంలోని ఆసుప్రతికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేదు. తీవ్రగాయాలతో నేవీ కమాండర్ గోవింద్ తుది శ్వాస విడిచారు. అతడి మృతదేహాన్ని పశ్చిమ బెంగాల్ నుండి ముందుగా విశాఖలోని ఐ.ఎన్.ఎస్ కర్ణలో ఉంచి.. ఆర్మీ అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం అతడి స్వగ్రామానికి తరలించారు.
విజయనగరం జిల్లా పర్లకు మృతదేహం చేరుకోగానే తల్లి, స్నేహితులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. చిన్న వయసులోనే తమను వదిలి తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయావా భోరున విలపించారు. తల్లి చందక లక్ష్మిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. కుమారుడి గురించి తలచుకుంటూ ఆమె ఏడుస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టిస్తోంది. అతడిని కడసారి చూసేందుకు తండోపతండాలుగా తరలి వచ్చారు. అతడి పార్టీవ దేహానికి నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం కొంత సేపు ఉంచిన తరువాత శ్మశాన వాటికకు భౌతికకాయాన్ని తరలించారు. గోవింద్ పార్థివదేహాన్ని 20 కిలోమీటర్ల మేర ర్యాలీగా తీసుకెళ్లారు. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
దారి పొడవున ప్రజలు గోవింద్ అమర్‌రహే, జైజవాన్ అంటూ నినాదాలు చేశారు. భారత్‌మాత ముద్దుబిడ్డ అమర్‌రహే అంటూ స్లోగన్స్ చేశారు. నేవీ కమాండో చందక్ గోవింద్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాల మధ్య ఘనంగా ముగిశాయి. ఆర్మీ, నేవీ అధికారులతో పాటు అటు ఏపీ నుండి పలువురు నేతలు, అధికారులు కూడా పాల్గొన్నారు. విశాఖలో నేవల్ బేస్‌లో మైరెన్ కమాండ్‌గా పనిచేస్తున్నారు చందక గోవింద్. బుర్ద్వాన్ జిల్లాలోని పనాగడ్ ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో పారా ట్రూపర్స్ ట్రైనింగ్ టీంలో గోవింద్ సభ్యుడిగా ఉన్నారు. ఈ శిక్షణలో భాగంగా పారాచూట్ తెరుచుకోకపోవడంతో అతడు కిందపడిపోయాడు.హెలికాఫ్టర్ నుంచి సాధారణ డ్రాప్ సమయంలో అదృశ్యమైనట్టు ఇండియన్ నేవీ తెలిపింది.