నేటి చిన్నారుల్లో తెలివి తేటలు పుష్కలంగా ఉంటున్నాయి. పెద్ద విషయాన్ని కూడా చిటికెలో అవపోశన పట్టేస్తున్నారు. వారి వయస్సులో మిరాకిల్స్ చేస్తున్నారు. ఐదేళ్లు కూడా నిండని చిన్నారులు టాలెంట్ తో దూసుకువెళుతున్నారు. నంద్యాలకు చెందిన మోక్ష అయాన్‌కు కేవలం రెండేళ్లు పిల్లవాడు అద్భుతం చేశాడు.
పిట్ట కొంచెం కూత ఘనం.. ఈ సామెత నేటి పిల్లలకు సరిగ్గా సరిపోతుంది. నేటి చిన్నారుల్లో తెలివి తేటలు పుష్కలంగా ఉంటున్నాయి. పెద్ద విషయాన్ని కూడా చిటికెలో అవపోశన పట్టేస్తున్నారు. వారి వయస్సులో మిరాకిల్స్ చేస్తున్నారు. ఔరా అంటూ అబ్బుర పరుస్తున్నారు. పాఠాలే కాదూ పద్యాలు, సంస్కృత పదాలు ఏదీ అడిగినా చెబుతున్నారు. ఐదేళ్లు కూడా నిండని చిన్నారులు టాలెంట్ తో దూసుకువెళుతున్నారు. ఐదేళ్లకే బ్రిటన్‌కు చెందిన ఓ పాప పుస్తకమే రాసేసింది. అలాగే కొవ్వూరు పట్టణానికి చెందిన పిల్లా డోలా కృష్ణ అనే బాల మేధావి ఏమీ అడిగినా ఇట్టే చెప్పేస్తుండటంతో.. వీరిద్దరూ గిన్నీస్ రికార్డులో స్థానం కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు మరో బుడతడు తన ప్రతిభతో అబ్బురపరుస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ నంద్యాలకు చెందిన మోక్ష అయాన్‌కు కేవలం రెండేళ్లు.. కానీ ఇండియా బుక్ ఆప్ రికార్డ్స్‌లో తన పేరు లిఖించుకుని అరుదైన రికార్డు సాధించాడు. అతడు జంతువులు, సంఖ్యలు, పక్షులు, జాతీయ నాయకులు, వాహనాలు గుర్తించి ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చూసిన వెంటనే రికగ్నైజ్ చేయడంతో పాటు ఇట్టే పట్టేయడంతో.. వీటిని ఎప్పటికప్పుడు రికార్డు చేసింది బాలుడి తల్లి స్వప్నిక. వీటన్నింటిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపింది. వారు పరిశీలించి బాలుడి ప్రతిభ ఆధారంగా ఓ ధ్రువపత్రం, పతకాన్ని పంపించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి అవి అందడంతో తల్లిదండ్రులు ఉబ్బితబ్బి అవుతున్నారు.