ఆంధ్రప్రదేశ్ లో అసనీ తుఫాన్ అల్లకల్లోలం స్పష్టిస్తోంది. అసనీ దూసుకొస్తుడంటంతో తీరప్రాంతాలలో భయాందోళనలు నెలకొన్నాయి. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు బీభత్సం స్పష్టిస్తున్నాయి. సముద్రం కూడా కల్లోలంగా మారింది. అసనీ ప్రభావం ఏపీ, ఒడిశాతో పాటు పలు తీర రాష్ట్రాలలో కూడా కనిపిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ప్రమాదకరంగా ఎగిసిపడుతున్నాయి.
ఇప్పటికే అసనికి సంబంధించిన వార్తలు విని ఏపీ తీర ప్రాంతాలలో ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఇప్పటివరకు సముద్ర తీరప్రాంతంలో ఉన్న సంపదకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అసని ఎఫెక్ట్ కి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భారీ ఈదురు గాలుల కారణంగా ఇళ్ల కప్పులు కూడా ఎగిరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటిపై ఉన్న రేకులు రోడ్డుపై నిలబడిన వ్యక్తి మీదకు దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి పెను ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. వీడియో చూసినవారంతా ఆ వ్యక్తి అదృష్టం బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటన ఏపీలో ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
— K I N G (@KingKalyanPK) May 11, 2022