గజం స్థలం కోసం అన్యాయాలకు అక్రమాలకు పాల్పడే వారు ఉంటున్న నేటి సమాజంలో గజాల లెక్కన తన కోట్ల విలువైన భూమిని నిరుపేదలకు దానం చేసే వారు నూటికొక్కరు మనకు కనిపిస్తారు. దేవుడి పూజ కన్నా కష్టాల్లో ఉన్న పేదవారిని ఆదుకుంటే అదే నిజమైన దేవుడి సేవా అని నమ్మిన వ్యక్తి అతను. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన దేవసాని రామమనోహర్ రెడ్డి. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన విద్యావేత్త దేవసాని మనోహర్ రెడ్డి 30 ఏళ్ల క్రితం సొంత ఊరిని వదలి బెంగుళూరులో స్థిరపడ్డారు. అతను అక్కడే ఉన్న మనసు మాత్రం ఊరిపైనే. అందుకే ఊరికి వచ్చిన ప్రతిసారీ లక్షల రూపాయలు దానధర్మాలు చేస్తుంటారు.
ఇటీవల గ్రామానికి వచ్చిన మనోహర్ రెడ్డి తన రూ. కోటి విలువైన నాలుగు ఎకరాల స్థలాన్నిఉచితంగా 150 మంది పేదల అందజేశారు. ఒక్కొక్కరికి 170 చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించాడు. వాటికి సంబంధించిన పత్రాలను గ్రామ పెద్దల సమక్షంలో పేదలకు అందజేశాడు. మరో 100 మంది కోసం మూడెకరాల స్థలం సిద్ధం చేస్తున్నట్లు రామ మనోహర్ రెడ్డి తెలిపారు. అతని ధాతృత్వానికి అక్కడి వారు ఫిదా అవుతున్నారు. రామ్ రెడ్డిగారు గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు. ఉన్న ఆస్తి కన్నా ఇంకా సంపాందించాలనే ఆశలతో కొట్టుకున్న జనాల మధ్య ఇలాంటి వారు ఒక ధృవతారగా నిలుస్తారు. రామ్ మనోహర్ రెడ్డి చేస్తున్న ఈ సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.