నేటి కాలంలో సాటి మనిషిని ఒంటి రంగుని చూసి పలకరించేవాళ్లు చాలా మంది ఉంటారనే చెప్పాలి. ఇంకొందరైతే కులం పేరుతో, అవయవాలు సరిగ్గా లేకపోయిన, మాసిన బట్టలు వేసుకున్నా అస్సలు దగ్గరకు రానివ్వరు. ఇక చర్మ సమస్యలున్న వ్యక్తుల బాధలైతే వర్ణనాతీతం. ఇలాంటి ఓ అరుదైన చర్మ సమస్యతో బాధపడుతున్న పాము ప్రసాద్ కన్నీటి కథలు ఇప్పుడు తెలుసుకుందాం.
అతని పేరు పాము ప్రసాద్, వయసు 18 ఏళ్లు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం జెడ్.కొత్తపట్నం గ్రామం. ఇంటి పేరుతో పాటు అతని ఒంటి రంగు కూడా పాము రంగును పోలి ఉండడం విశేషం. ఇలాంటి అరుదైన చర్మ వ్యాధి అతనికి పుట్టుకతోనే వచ్చిందట. అతడు ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలన్నా, ఆడుకోవాలన్నా, స్కూలుకు వెళ్లాలన్న ఎవరూ కూడా దగ్గరకు రానివ్వరు. దీంతో ప్రసాద్ మానసికంగా క్రుంగిపోతున్నాడు. ఈ కారణం చేత అతనిని ఎవరూ కూడా దగ్గరకు రానివ్వకుండా అంటరాని వాడిలా చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: వరల్డ్ లోనే కాస్ట్లీయెస్ట్ మ్యాంగో ఫ్రూట్స్…! రేటు ఎంతంటే..?
ఇంతటి ప్రమాదకరమైన వ్యాధితో ఉన్న ప్రసాద్ చర్మం పాము కుబుసం ఊడిపోయినట్లుగా ఊడిపోతూ ఉంటుంది. ఇంటితో పేరుతో పాటు అతని ఒంటి రంగు కూడా పాము రంగు పోలి ఉండడమనేది అతనికి శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వింత చర్మం వ్యాధి కారణంగా ప్రసాద్ చర్మం రోజు పొరలు పొరలుగా ఊడిపోతోంది. దీంతో అతని బాధ వర్ణనాతీతం అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి చిన్నప్పుడే మరణించడం కూడా ప్రసాద్ కు నరకంలా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఇంతటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న పాము ప్రసాద్ బాధలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.