ఈ మద్య కొంతమంది డబ్బు కోసం ఎంతటి నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. సొంత, పరాయి అనే తేడా లేకుండా డబ్బుకోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. బంధాలు, బంధుత్వాలు మర్చిపోతున్నారు. సొంతవారినే మోసం చేస్తూ అవసరమైతే చంపడానికైనా సిద్దపడుతున్నారు.
డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు కొంతమంది డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. బంధాలు.. బంధుత్వాలు అనేవి చూడకుండా డబ్బు కోసం ఎంతటి నీచమైన పనికైనా తెగబడుతున్నారు. కనీ పెంచిన తల్లిదండ్రులను ఆస్తి కోసం చంపిన కన్నబిడ్డలు ఎంతో మంది ఉన్నారు. తాగుడికి బానిసై డబ్బు ఇవ్వలేదన్న కోపంతో భార్యను కడతేర్చిన భర్తలు ఉన్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్దపడుతున్నారు. తాజాగా సొంత మేనమామ డబ్బు కోసం తన అల్లుడిని చంపడాని ప్రయత్నిస్తున్నాడు.. దీంతో ఆ బాలుడు హెర్ఆర్సీని ఆశ్రయించాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..
కర్నూల్ జిల్లా వినుకొండకు చెందిన ఓ బాలుడు తనకు ప్రాణా హాని ఉందని.. తన బంధువుల నుంచి రక్షించాలని కర్నూల్ హెర్ఆర్సీకి 10 పేజీల లేఖ రాశాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు ప్రస్తుతం ఓ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఉంటున్నాడు. బాలుడు కష్టాలు అతని మాటల్లోనే.. మా అమ్మపేరు ఉమాదేవి.. నేను పుట్టిన తర్వాత చనిపోయింది. నన్ను కొంతకాలం ఓ మహిళ పెంచుకుంది. హాస్టల్ లో ఉంటూ 5వ తరగతి వరకు ఆమె సంరక్షణలో పెరిగాను. ఆ తర్వాత నన్ను మేనమామ, అత్త తీసుకొని వెళ్లారు. ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత నాకు నరకం మొదలైంది. ఆరో తరగతి నుంచి తొమ్మితో తరగతి వరకు నాలుగు సంవత్సరాలు కూలికి పంపించారు.. నాతో వెట్టి చాకిరీ చేయించుకున్నారు. అల్లుడు అన్న కనికరం లేకుండా దారుణంగా తిడుతూ.. కొడుతూ హింసించేవారని కన్నీరు పెట్టుకున్నాడు.
చిన్నప్పటి నుంచి నన్ను టార్చర్ పెడుతుంటే భరిస్తూ వచ్చానని.. ఇటీవల నన్ను వినుకొండకు తీసుకు వచ్చి పూర్తిగా చదువు మానిపించి పనికి పంపించడం మొదలు పెట్టారు. నాకు ఒకరోజు బాగా జ్వరం వచ్చింది.. ఆరోగ్యం బాగాలేదని నేను పనికి వెళ్లనని చెప్పా.. దాంతో నన్ను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వచ్చాను. గతంలో నన్ను పెంచిన తల్లి సలహా మేరకు మానవ హక్కుల కమీషన్ వద్దకు వెళ్లి నా బాధ గురించి చెప్పాను. సార్ కి పది పేజీల లెటర్ రాసి ఇచ్చాను. నాకు సంబంధించిన ఆస్తి, ఫిక్స్ డ్ డిపాజిట్ల కోసం నా మేన మామ కుటుంబ సభ్యులు హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. నెల రోజుల క్రితం కారు తో గుద్దించారు. ప్రాణాలతో బయట పడ్డాను. అప్పుడే హెచ్ఆర్ సీకి లేటర్ రాశాను. ఆ సార్ పై కూడా మామయ్య కుటుంబం ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం నేను సాంఘిక సంక్షేమ హాస్టల్ కి వచ్చి ఉంటున్నాను.. ఈ మద్య మా మామ కొడుకు వచ్చిన నిన్న చంపుతా అంటూ బెదిరించి వెళ్లాడు. దీంతో నేను పెద్ద సార్ ని కలిసి నన్ను బెదిరిస్తున్నారని.. నాకు ప్రాణహాని ఉందని చెప్పాను. సార్ వెంటనే స్పందించిన వారిపై ఎంక్వేయిరీ చేస్తున్నారు. హెచ్ఆర్సీని ఒక్కటే కొరుకుంటున్నా.. బాగా చదువుకోవాలి.. నేను ఒంటరిగా ఉంటాను.. నాకు ఏ బంధువులు వొద్దు.. అనాధగా ఉండేందుకు సిద్దం.. ఇలాంటి రాకాసి బంధువుల నుంచి రక్షణ కల్పించండి.. అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. బాలుడి ఆవేదనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.