ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉన్న వారికి మంచి ప్రయోజనం ఉంది. పీఎఫ్ ఖాతాలో ప్రతి నెల డబ్బులు జమ అవుతుంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇన్స్యూరెన్స్ స్కీమ్. పీఎఫ్ బెనిఫిట్స్‌లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ఉంది. ఈ పథకం ద్వారా ఎంప్లాయి కుటుంబానికి రూ.7 లక్షల వరకు ప్రయోజనం దక్కే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు అందరూ ఈ స్కీమ్‌లో కవర్ అవుతారు.
ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్ కొనసాగిస్తున్న సమయంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల బీమా అందుతుంది. ఈ బీమా ప్రయోజనం పొందాలంటే ఉద్యోగులు ఈ-నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే నామినీ వివరాలను ఈపీఎఫ్ అకౌంట్‌లో నమోదు చేయాలి. ఇప్పుడు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే నామినీ వివరాలు ఎంటర్ చేయవచ్చు. ఈపీఎఫ్ మెంబర్స్ అందరూ ఇ-నామినేషన్ ఫైల్ చేసి తమ కుటుంబాలకు సామాజిక భద్రత అందించాలని ఈపీఎఫ్ఓ కూడా కోరుతోంది.