నేటి ఆధునిక జీవితంలో మనిషి యంత్రం కంటే ఎక్కువగా పరిగెడుతున్నాడు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం కూర్చుని తినడానికి కూడా టైమ్ ఉండటం లేదు. దాంతో దార్లో ఉండే హోటల్లలో ఆదరా బాదరాగా తిని ఆఫీస్ లకు వెళ్తుంటారు ఉద్యోగులు. ప్రస్తుతం హోటల్లలో ఆహార పదార్థాల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. నేడు ఒక చిన్న ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళ్లి తినాలి అంటే కనీసం రెండు వేలు ఉండాల్సిందే. ప్రస్తుతం పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో పాటుగా ఫుడ్ రేట్లను కూడా పెంచారు హోటల్స్ యజమానులు. ఈ క్రమంలోనే 1965 సంవత్సరానికి సంబంధించిన ఓ హోటల్ బిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ధరల పట్టిక చూస్తే.. మీరు షాక్ అవ్వడం ఖాయం.
ప్రస్తుత కాలంలో ప్రతీ ఉద్యోగి దాదాపు బయటి ఫుడ్ తినడానికే ఇష్టపడుతున్నాడు. అతడికి టైమ్ ఉండకపోవడంతోనో లేక రుచిగా ఉంటుందనో హోటల్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. ఇక ప్రస్తుతం నిత్యవసర ధరలతో పాటుగా పలు రకాల ట్యాక్స్ లు వేయడంతో టిఫిన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది 1965 నాటి హోటల్ బిల్. ఆ ధరలు చూస్తే మీరు ముక్కుమీద వేలేసుకుంటారు. ఆ ధరలకు ఇప్పుడు కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా రావు. 1965 నాటి బిల్లులో టిఫిన్ ధరలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ధరలు పెంచుతున్నామన్న బోర్డు ప్రతీ హోటల్ లో మనకు కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లె పట్టణంలో 1965లో ధరలు పెంచారు హోటల్ యజమానులు. ప్రస్తుతం ఆ బిల్లు నెట్టింట్లో వైరల్ గా మారింది. అందులో ఇలా రాసుంది.” నవంబర్ 1 1965 నుండి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగినందున రేపల్లె లో ఉన్న అందరు హోటల్ యజమానులు సమావేశమై రేట్లు సవరించారు. నవంబర్ 1 నుంచి ఈ క్రింది విధంగా రేట్లు పెంచాం. పెరిగిన ధరలకు అందరు సహకరించాలి” అని ఆ పేపర్ లో రాసుంది.
ఇక అప్పటి టిఫిన్స్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. రెండు ఇడ్లీలు రూ.15పైసలు, ఒక ఇడ్లి 8 పైసలు, అట్టు – 15 పైసలు, ఉప్మా- 15పైసలు, రవ్వట్టు – 20 పైసలు, రెండు గారెలు – 15 పైసలు, ఒక గారె – 8 పైసలు, 2 మసాలా గారెలు – 20 పైసలు, 2 బోండాలు – 20 పైసలు, కాఫీ – 15 పైసలు గా ఉన్నాయి. ఈ ధరలను ఇప్పడు చూస్తే.. ఆ ధరలకు ఇప్పుడు కనీసం గ్లాస్ మంచినీళ్లు కూడా రావు. అయితే ఎప్పటి ఖర్చులు అప్పటివే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి నెట్టింట్లో వైరల్ గా మారిన 1965 నాటి హోటల్ బిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.