తనూజ పట్టణంలోని కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో అతడ్ని బెంగళూరుకు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ తనూజ తుది శ్వాస విడిచాడు.
ఈ మధ్య కాలంలో గుండెపోట్లు ఎక్కువయిపోయాయి. గుండెపోట్ల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో మృత్యువాతపడుతున్నారు. అసలు ఆ గుండెపోట్లు రావటానికి కారణాలు తెలియకుండానే నూటికి తొంభై శాతం మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా, ఓ యువకుడు గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచాడు. అతి చిన్న వయసులో 19 ఏళ్లకే ఈ లోకాన్ని వదిలిపోయాడు. స్నేహితులతో కలిసి కబడ్డీ ఆడుకుంటూ ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని మడకశిర మండలం అచ్చంపల్లి తాండాకు చెందిన 19 ఏళ్ల తనూజ నాయక్.. పట్టణంలోని పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ చదువుతున్నాడు. తాజాగా, తనూజ స్నేహితులతో కలిసి కాలేజీ గ్రౌండ్‌లో కబడ్డీ ఆడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తనూజ ఉన్న వైపునకు ప్రత్యర్థి కూతకు వచ్చాడు. ఈ సందర్భంగా తనూజ వెనక్కు వెళుతూ, వెళుతూ అలాగే కుప్పకూలాడు. అతడు ఎందుకు అలా పడిపోయాడో స్నేహితులకు అర్థం కాలేదు.
వెంటనే అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనూజ నాయక్ చనిపోయాడు. తనూజ మృతితో అతడి కుటుంబంతో పాటు స్నేహితుల సర్కిల్‌లో కూడా విషాదం చోటుచేసుకుంది. అచ్చంపల్లి తాండా వాసులు చిన్న వయసులోనే తనూజ గుండెపోటుతో చనిపోవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తనూజ కబడ్డీ గ్రౌండ్‌లో కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, గత కొద్దిరోజులుగా పెచ్చుమీరి విలయతాండవం చేస్తున్న గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.