తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నగారా మోగింది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాలు ముమ్మరంగా ప్రచారాలు చేయడం మొదలు పెట్టాడు. ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు చేస్తుంటే.. అధికార పక్ష నేతలు గడప గడపకు తిరిగి తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13 న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 13న సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అదేశాలు జారీ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారా సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు గా ఉత్వర్వులు జారీ చేశారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నగారా మోగింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎలక్షన్ కమీషన్. రాష్ట్రంలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. 9 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో 5 స్థానాలు ఇప్పటికే అధికార పార్టీ ఏకగ్రీవంగా గెల్చుకుంది. మిగిలిన నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గాల స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పోటీల్లో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ క్రమంలో తాము బలపరిచే అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. మూడు పట్టభద్రులు, రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోటీ జరగబోతుంది. 16 న కౌంటింగ్ చేపట్టి.. అదే రోజు ఫలితాలు ప్రకటించబోతున్నారు.
ఈ నెల 13 న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అఫిషియల్ గా సెలవు ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఏపీలో జరిగిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా చేసుకొని అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచి జోరుగా ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కీలకంగా మారబోతున్నాయి. అయితే ఈ ఎమ్మెల్సి ఫలితాలు కూడా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించవొచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏపిలో ఈ నెల 13 న సెలువు దినంగా ప్రకటించడంతో అందరూ అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ లో హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయ్యింది.