సరదాగా ఆడుకుందామనుకున్న 11 ఏళ్ల పిల్లాడు ఆశలు అతని ప్రాణాలు తీసింది. అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వేసవి కాలం మొదలయ్యింది. తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో ఎండ తాపం నుంచి ఉపశమనం కోసం పిల్లలు బావులు వెంట, కాలువ వెంట పరుగులు పెడుతుంటారు. ఇది తల్లిదండ్రులకు కాస్త ఆందోళన కలిగించేదే. ఈత అనే సరదా పిల్లల ప్రాణాలు తీస్తోంది. ఇలానే ఓ బాలుడు సరదాగా స్విమ్మింగ్ ఫూల్‌లో దిగిన పాపానికి అతని ప్రాణాలు తోడేసింది. ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలు..
అనకాపల్లి జిల్లా పరిధిలోని వుడ్ పేటలో నివాసముంటున్న సతీష్, కిరణ్ కుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి ప్రభాస్ వయస్సు 11 ఏళ్లు కాగా, ,చిన్నబ్బాయి వర్షా వయసు నాలుగేళ్లు. గత కొన్ని రోజులుగా పెద్దబ్బాయి స్విమ్మింగ్ ఫూల్ కు వెళదామని మారాం చేయడంతో.. సాయంత్రం తల్లి ఇద్దరు పిల్లలు తీసుకొని శంకరం వద్దనున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్ళింది. అక్కడ ప్రభాస్ స్విమ్మింగ్ పూల్ లో దిగి ఆడుకుంటుండగా, వర్షా ట్యూబ్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. ఇంతలో గట్టుపై ఉన్న చిన్న కొడుకు హర్ష బయటవైపు పరిగెత్తాడు. అతన్ని పట్టుకున్నందుకు తల్లి అతని వెంట వెళ్ళింది. తిరిగి వచ్చే చూసేసరికి స్విమ్మింగ్ పూల్ లో ఉన్న పెద్దబ్బాయి కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ తల్లి చుట్టూ గాలించింది.
అయినా ఫలితం లేకపోవడంతో నిర్వాహకులను అడిగింది. వారి అనుమానం నిజమైంది. నిర్వాహకులు వెంటనే స్విమ్మింగ్ పూల్ లోపలికి దిగి చూసేసరికి ప్రభాస్ నీటిలో మునిగి ఉన్నాడు. అపస్మారక పరిస్థితిలో ఉన్న అతనిని గట్టుపై తెచ్చి నీటిని బయటకి కక్కించే ప్రయత్న చేశారు. అనంతరం హుటాహుటీన ఆస్పత్రికి తరలించిగా పరిశీలించిన వైద్యులు, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. పెద్దవాడు ఎక్కడ..? అని అడిగితే తన భర్తకు ఏం సమాధానం చెప్పాలంటూఆ తల్లి రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మీరు కూడా మీ పిల్లల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండండి.
విషాద ఘటన.. వేసవి సరదా 11 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసింది! pic.twitter.com/lwbRcpMLOb
— Rajasekhar (@Rajasek61450452) April 19, 2023