విజయం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. కానీ.. దాన్ని అందిపుచ్చుకోవడానికి పడే కష్టం మాత్రం అందరికీ అర్ధమయ్యేది కాదు. ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో కష్టనష్టాలు.. ఇవన్నీ చవిచూస్తే గాని ఒక వ్యాపారం..బ్రాండ్ గా మారదు. అలాంటి ఎన్నో సమస్యలను అధిగమించిన “నేచురల్స్” ఇప్పుడు దేశంలోనే అగ్రగామి సెలూన్ బ్రాండ్ గా ఎదిగింది. ఏదైనా కొత్త బిజినెస్ మాడ్యూల్ తో తమని తాము నిరూపించుకోవాలి అనుకున్న “వీణా కొమురవెల్లి”, “సీకే. కొమురవెల్లి” మదిలో తట్టిన ఆలోచనే “నేచురల్స్” సెలూన్.
అది 2000 సంవత్సరం. బ్యూటీ సెలూన్ ఇండస్ట్రీ గురించి చాలా మందికి సరైన అవగాహన కూడా లేని రోజులు. కానీ.. వీణా కొమురవెల్లి భవిష్యత్ ను ముందే ఊహించారు. రానున్న కాలంలో బ్యూటీ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉంటుందో ఆమెకి ముందే అర్ధమైంది. ఆ సమయంలో వారి ఆలోచనను ఎవ్వరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. 14 బ్యాంకులు.. వీరి బిజినెస్ మోడల్ ను నమ్మి లోన్ ఇవ్వడానికి ముందుకి రాలేదు. పోనీ ఆర్థికంగా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆదుకుంటారనుకుంటే వారి పరిస్థితి కూడా అంతంతమాత్రమే. అలాంటి పరిస్థితుల్లో కూడా వీణా కొమురవెల్లి, సీకే. కొమురవెల్లి దైర్యం కోల్పోకుండా ముందు అడుగు వేశారు.
బ్యూటీ అడ్వైజర్ తో పాటు.. సర్వీస్ ప్రొవైడర్స్ భర్తీ చకచకా జరిగిపోయాయి. అంతా కలసి ఒక జట్టుగా.. ఎంతో ఫ్యాషన్ తో పని చేసినా.., ఆపరేషన్ బ్రేక్ ఈవెన్ రావడానికి వీరికి 12 నుండి 18 నెలల సమయం పట్టింది. అయితే.. అక్కడ నుండి బ్యూటీ సెక్టార్ లో “నేచురల్స్” తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. “నేచురల్స్” గ్రోత్ చూసి ఫ్రాంచైజీల కోసం ఒత్సాహిక వ్యాపారస్తులు ఆసక్తి చూపిస్తూ వచ్చారు. అలా.. 2007 వరకు ఒకటిగా ఉన్న నేచురల్స్ సెలూన్.. నేటికి 700కి పైగా ఫ్రాంచైజీలతో దేశంలోనే అగ్రగామి సెలూన్ బ్రాండ్ గా ఎదిగింది. ఈ క్రమంలో ఎంతో మంది మహిళలకు, యువతకు నేచురల్స్ బ్రాండ్ ఫ్రాంచైజీ మోడల్ వ్యాపార అవకాశాన్ని కల్పించడం విశేషం.
ఇంత విజయవంతంగా సాగిపోతున్న నేచురల్స్ బ్రాండ్ ఫ్రాంచైజీ మీరు తీసుకోవాలి అనుకుంటే.. వివరాల కోసం GOFranchise@Sumantv.comకు మెయిల్ చేయండి. ఇక నేచురల్స్ సెలూన్ బ్రాండ్ ఫ్రాంచైజీ మోడల్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియోని క్లిక్ చేయండి.