పక్క మనిషికి కష్టం వస్తే.. అయినవాళ్లే మనకెందుకుని తప్పించుకునే రోజులు ఇవి. ఇలాంటి కాలంలో ముక్కు మొహం తెలియని వారి వైద్య అవసరాలను తీరుస్తూ.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే వారిని ఏమనాలి? ఇలా.. దైవం మనుష్య రూపేణా అన్న నానుడిని నిజం చేస్తూ కష్టంలో ఉన్న వారంతా మా వాళ్లే అంటోంది Milaap.org సంస్థ. ఆరోగ్యం, ప్రకృతి వైపరీత్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక స్తోమత లేనివారి కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తూ ఆదుకుంటున్నారు. గత ఎనిమిదేళ్లుగా అవసరంలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తూ ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించారు. సమస్యను బట్టి రూ.15 వేల నుంచి కోట్ల రూపాయల వరకు క్రౌడ్ ఫండింగ్ చేసి ప్రాణాలను కాపాడారు. వైద్యావసరాలకు అప్పులిచ్చే లెండింగ్ ప్లాట్ ఫామ్ గా ప్రారంభం అయిన Milaap.org సంస్థ ఇప్పుడు ఎంతో మందికి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తోంది. ఆ సంస్థ ఎలాంటి సహాయ, సహకారాలు అందిస్తుంది? Milaap ద్వారా మీరు ఎలాంటి సహాయం పొందవచ్చు అనే పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో తెలుసుకోండి.