SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Reason Behind Whatsapp And Facebook Outage

ఆగిపోయిన వాట్సప్‌.. భారీగా నష్టపోయిన కంపెనీ.. ఇది హ్యాకర్ల పనేనా?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 5 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆగిపోయిన వాట్సప్‌.. భారీగా నష్టపోయిన కంపెనీ.. ఇది హ్యాకర్ల పనేనా?

నిన్న రాత్రి పేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పనిచేయలేదు. దీంతో నెటిజన్లు తీవ్ర ఇబ్బందు పడ్డారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కోట్లమంది ఒక్కసారిగా యాప్స్‌ పనిచేయకపోవడంతో కంగారుపడ్డారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 గంటల పాటు ఈ మూడు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ పనిచేయలేదు. వీటికి తోడు ట్విట్టర్‌, టిక్‌టాక్‌, స్నాప్‌చాట్‌ కూడా నెమ్మదించాయి. ఇలా సోషల్‌ మీడియా యాప్స్‌ నిలిచిపోవడంతో హ్యాకర్లు తమ పంజా విసిరారని అంతా భావించారు. అప్పటి వరకూ పేస్‌బుక్‌ కంపెనీ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇది హ్యాకర్ల పనే అని చాలామంది నిపుణులు కూడా భావించారు.

రూ.50 వేల కోట్ల నష్టం..

ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌కు భారీ నష్టం వాటిల్లింది. సుమారు 7 బిలియన్ల డాలర్ల(50 వేల కోట్ల పైనే) నష్టం జరిగింది. ఫేస్‌బుక్‌ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్‌లో డ్యామేజ్‌ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్‌బర్గ్‌ స్థానాన్ని తగ్గించింది. సెప్టెంబర్‌ మధ్య నుంచి ఫేస్‌బుక్‌ స్టాక్‌ 15 శాతం పడిపోగా.. ఒక్క సోమవారమే 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. దీంతో ఐదో స్థానం నుంచి కిందకి జారిపోయాడు జుకర్‌బర్గ్‌. ప్రస్తుతం 120.9 బిలియన్‌ డాలర్లతో బిల్‌గేట్స్‌ తర్వాత రిచ్‌ పర్సన్స్‌ లిస్ట్‌లో ఆరో ప్లేస్‌లో నిలిచాడు మార్క్‌ జుకర్‌బర్గ్‌.

ఇది హ్యాకర్ల పనా? లేక సాంకేతిక సమస్యా?

Facebook Instagram Whatsapp Hacking - Suman TV

ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ‘నెగెటివ్‌’ కథనాల ప్రభావం వల్లే ఇలా జరిగి ఉంటుందని కొందరు, ఇది హ్యాకర్ల పని అని మరికొందరు రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది. డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌(డీఎన్‌ఎస్‌).. ఇంటర్నెట్‌కు ఫోన్‌ బుక్‌ లాంటిది. ఇందులో సమస్య తలెత్తడం వల్ల సమస్య తలెత్తవచ్చని మొదట భావించారు. ఆ అనుమానాల నడుమే.. బీజీపీ (బార్డర్‌ గేట్‌వే ప్రోటోకాల్‌)ను ఓ ఉద్యోగి మ్యానువల్‌గా అప్‌లోడ్‌ చేయడం కారణంగానే ఈ భారీ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కావాలనే చేశాడా? పొరపాటున జరిగిందా? తదితర వివరాలపై స్పష్టత రావాల్సింది ఉంది.

సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయనేదానిపై ఫేస్‌బుక్‌ నుంచి స్పష్టమైన, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజీపీ రూట్స్‌లో సర్వీసులకు విఘాతం కలగడం వల్ల ఫేస్‌బుక్‌, దానికి సంబంధించిన ప్రతీ వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కొద్దిగంటల పాటు ఫేస్‌బుక్‌ ఉద్యోగుల యాక్సెస్‌ కార్డులు పని చేయకుండా పోయాయట. దీంతో వాళ్లంతా కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌ హెడ్‌ ఆఫీస్‌ బయటే ఉండిపోయారు. ఇక బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) అనేది గేట్‌వే ప్రోటోకాల్‌ను సూచిస్తుంది, ఇది స్వయంప్రతిపత్త వ్యవస్థల మధ్య రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇంటర్నెట్‌ని అనుమతిస్తుంది.

Tags :

  • facebook
  • Social Apps Not Working
  • WhatsApp
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచ