నథింగ్ ఫోన్ 1.. మార్కెట్లో త్వరలో లాంఛ్ కానున్న ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ నథింగ్ ఫోన్ 1 కి సంబంధించి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో ఎంతో అద్భుతంగా ఉన్న నథింగ్ ఫోన్ 1 మొబైల్ ను చూసి అందరూ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని వెయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మిగతా స్మార్ట్ ఫోన్లకు భిన్నంగా కనిపిస్తున్న ఈ మొబైల్ సరికొత్త ట్రెండీ లుక్ లో కనిపించనుందని స్పష్టంగా అర్థమవుతోంది. అసలు నథింగ్ ఫోన్ 1 ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? దీని ప్రత్యేకత ఎంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం చూడని ఏ ఆండ్రాయిడ్ ఫోన్లలో లేని బాక్సీ డిజైన్ ఈ నథింగ్ 1 కనిపించడం విశేషం. ఐఫోన్ 12 తరహాలో నథింగ్ పోన్ 1 వర్టికల్లీ ప్లేస్‌డ్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టంతో రానుందని తెలుస్తోంది. దీనిలో ఉండే గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనే ఫీచర్ మొబైల్ వెనుక ఉన్న లైట్ సెటప్‌ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు భిన్నమైన రింగ్ టోన్స్ వచ్చే సమయంలో లైట్స్ బ్లింక్ అయ్యేలా కూడా సెట్ చేసుకోవచ్చట. ఐఫోన్ 12 తరహాలో ఈ మొబైల్ కు వర్టికల్లీ ప్లేస్‌డ్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టం ఈ నథింగ్ ఫోన్ 1లో కనిపించనుంది. ఇక నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కూడా అలెర్ట్ చేసేలా ఈ లైట్స్ తోడ్పడతాయి. ఇది కూడా చదవండి: జియో గూగుల్ నెక్స్ట్ ఫోన్! దేశంలో 30 కోట్ల మందికే అవకాశం! ఇక ఇదే కాకుండా ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందో కూడా ఈ లైట్స్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉండడం మరో విశేషం. దీనికోసం సెట్టింగ్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మొబైల్ కు చార్జింగ్ పెట్టగానే లైట్ సెటప్‌లో సన్నని గీత వెలుగుతుంది. ఏ ఆండ్రాయిడ్ ఫోన్లలో మనం చూడని విధంగా నథింగ్ 1 బాక్సీ డిజైన్‌తో కస్టమర్ల ముందుకొస్తోందని తెలుస్తోంది. ఇక ఇన్ని అబ్బురపరిచే ఫీజర్లు ఉన్న ఈ మబైల్ ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి రానుందా అని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నో ఆకర్షణీమైన ఫీచర్లతో ఉన్న నథింగ్ ఫోన్ 1 జులై 12న లాంఛ్ కానుంది. త్వరలో లాంచ్ కానున్న నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫీచర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.