కరోనా తర్వాత స్మార్ట్ ఉత్పత్తులకు డిమాండ్ అమాంతం పెరిగింది. అందుకే, ప్రముఖ స్మార్ట్బ్రాండ్లు వరుసగా స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తున్నాయి. అఫ్ఫోర్డబుల్ ఆడియో, ఆడియో అసెసోరిస్ తయారీదారు నాయిస్ బ్రాండ్ ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లకు చాలా ప్రసిద్ధి చెందింది. తాజాగా దేశీయ ఆడియో, వేరబుల్స్ తయారీ సంస్థ నాయిస్ తొలిసారి స్మార్ట్ గ్లాసెస్‌ను లాంచ్ చేసింది. నాయిస్ ఐ1 స్మార్ట్ ఐవేర్ పేరుతో భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో.. ఆడియో ప్రధానంగా ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను నాయిస్ తీసుకొచ్చింది. గూగుల్, స్నాప్, రేబన్ తీసుకొచ్చిన స్మార్ట్ గ్లాసెస్‌తో పోలిస్తే ఇది ఎంతో భిన్నంగా కనిపిస్తుంది. నాయిస్ స్మార్ట్ గ్లాసెస్ కి కెమెరాలు ఉండవు. అయితే ఆడియో స్పెసిఫికేషన్లు మాత్రం అద్భుతంగా పనిచేస్తాయి. మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపారిజన్ లాంటి ఫీచర్లతో నాయిస్ ఐ1 వస్తోంది. ఇందులో కాల్స్ కోసం మైక్ కూడా ఉంది. మ్యూజిక్ వినేందుకు స్పీకర్లు చాలా బాగా పనిచేస్తాయి. మిగిలిన ఫీచర్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ కంపెనీల స్మార్ట్ గ్లాసెస్‌తో పోలిస్తే ధర కూడా తక్కువగానే ఉంది.
నాయిస్ ఐ1 స్మార్ట్ ఐవేర్ ఫీచర్లు :
నాయిస్ ఐ1 స్మార్ట్ ఐవేర్ గ్లాసెస్.. గైడెడ్ ఆడియో డిజైన్‌తో వస్తోంది. దీంతో మ్యూజిక్ ఎంతో స్పష్టంగా వస్తుంది.. పరిసరాల శబ్దాలు ఇబ్బంది కలిగించకుండా బ్లాక్ చేసి మంచి వినసొంపైన సౌండ్ ని అందిస్తుంది. ఇందులో మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపారిజన్ ఫీచర్లతో వస్తోంది. అంతేకాదు.. మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్నప్పుడు కాల్స్ మాట్లేడేందుకు మైక్రో ఫోన్ కూడా ఈ గ్లాసెస్‌కు ఉంటుంది. నాయిస్ ఐ1 స్మార్ట్ ఐవేర్ గ్లాసెస్.. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 9 గంటల వరకు వినియోగించుకోచ్చు. 15 నిమిషాల చార్జింగ్‌తో 120 నిమిషాల మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుందని నాయిస్ పేర్కొంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 9 గంటల వరకు వినియోగించుకోచ్చు.
ఇక స్క్రీన్‌ల నుంచి వచ్చే బ్లూలైట్ నుంచి కళ్లకు రక్షణ ఉండేలా బ్లూలైట్ ఫిల్టరింగ్ సదుపాయం ఈ గ్లాసెస్‌కు ఉంది. నాయిస్ ఐ1 స్మార్ట్ ఐవేర్ గ్లాసెస్ యూవీ కిరణాల నుంచి కళ్లకు రక్షణను ఇస్తుంది. మల్టీ ఫంక్షన్ టచ్ కంట్రోల్స్‌ను నాయిస్ ఐ1 గ్లాసెస్ కలిగి ఉంటాయి. కాల్స్ యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం, మ్యూజిక్‌ను, వాల్యుమ్‌ను మేనేజ్ చేయడం, వాయిస్ అసిస్టెంట్‌ను టచ్ కంట్రోల్స్ ద్వారా చేయవచ్చు. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల సహా డివైజ్‌లు వాడే సమయంలో ఈ గ్లాసెస్ ధరిస్తే స్పష్టమైన విజన్ ఉంటుందని నాయిస్ పేర్కొంది.