దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొంతకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వెలులోకి తీసుకు వస్తున్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తా అంటూ వైఎస్సార్‌టీపీ తో ముందుకు వచ్చారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి యువత మోసపోయారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ఈ విషయంలో దీక్ష చేసిన విషయం తెలిసిందే. తాజాగా షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు… అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెను మేడిపల్లి పీఎస్ కు తరలించారు. ఈ నేపథ్యం లో […]