న్యూ ఢిల్లీ- నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం ముగ్గురు వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రఘురామ కృష్ణరాజుకు జరిపే వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో […]
హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణ రాజును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఎంపీ రఘురామ ఇంటిపై ఒక్కసారిగా దాడి చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ శుక్రవారం రాత్రి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామ […]
ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలను ఒక్కొక్కరుగా జైలుకి పంపిస్తున్న జగన్ సర్కార్.. ఇప్పుడు తన సొంత పార్టీ ఎంపీకే షాక్ ఇచ్చింది. నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఎంపీ రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఐడీ పోలీసులతో ఎంపీ రఘురామ కృష్ణరాజు వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు […]
న్యూ ఢిల్లీ- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తనను ట్రాప్ చేయడానికి ఓ మహిళ ద్వారా మెసేజులు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. తనను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా మనుషులను నియమించి, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని రఘురామ కృష్ణం రాజు మండిపడ్డారు. సజ్జల సూచన మేరకు తనకు సుమారు ఒక వంద ఫోన్ కాల్స్ వచ్చాయని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం పతనావస్థలో […]