తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన యువతి పోరాటం ఫలించింది. శ్రీకాంత్తో తనకు వివాహం జరిపించాలని కోరుతూ శ్రీదేవి గత నాలుగు రోజులుగా వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట దీక్ష చేపట్టింది. ఈక్రమంలో సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవ తీసుకున్నారు. శ్రీకాంత్, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడంతో పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. దీంతో నాలుగు రోజులుగా కొనసాగిన శ్రీదేవి దీక్షకు తెరపడింది. ఈ […]
లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం… చేతినిండా సంపాదన అని నమ్మించి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడో యువకుడు. పెళ్లి పేరిట కట్నకానుకలు, లండన్లో సొంతింటి పేరిట కోట్ల విలువైన ఆస్తిని కాజేసి, కట్టుకున్న భార్యను గెంటేసి విదేశాలకు చెక్కేశాడో ఘరానా భర్త. న్యాయం కోసం నిలదీస్తే అత్తింటి బంధువులు దాడులకు తెగబడ్డారు.దీంతో పాపం చేసేదేమి లేక న్యాయపోరాటిని దిగింది బాధితురాలు… వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కొండ్లే రజిత-సతీష్ కుమార్ దంపతుల కుమార్తె దివ్య. ఆమెకు వరంగల్ శివనగర్కు […]
తెలంగాణలో పదో తరగతి పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారం మర్చిపోక ముందే మరుసటి రోజు అనగా హిందీ పరీక్ష నాడు కూడా ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీనిపై వరంగల్ పోలీస్ కమీషనర్ స్పందించారు.
అమ్మ అనేది నెవర్ ఎండింగ్ ఎమోషన్. తొమ్మిది నెలలు మనల్ని పురిటిలో మోసి, ఆ తర్వాత జీవితాంతం మనకు ప్రతి కష్టంలోనూ తోడుండే ఆమె కోసం ఏమైనా చేస్తాం. ఎంతవరకైనా వెళ్తాం. ఇప్పుడు మేం చెప్పే రియల్ స్టోరీలోనూ అలాంటిదే జరిగింది. ఏకంగా తన తల్లి కోసం ఓ కొడుకు 30 ఏళ్లుగా న్యాయపోరాటం చేశాడు. వేరే లాయర్స్ అయితే న్యాయం ఎప్పటికి జరుగుతుందో అని సంశయించి, స్వయంగా తానే న్యాయవాది వృత్తిలోకి వచ్చాడు. చివరకు ఆమె […]