విజయవాడ భవానీపురంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఆ తల్లి రోధనతో అందరి కళ్లు చెమ్మగిల్లాయి. నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి అని ఆమె అడిగే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ తల్లిని ఓదార్చలేక అలా చూస్తూ ఉండిపోతున్నారు. ‘14 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది. ఎంఏ, పీహెచ్ డీ చేసిన నేను.. నా విజ్ఞాన్నాన్ని అంతా ఆ కూతురికి […]