పరీక్ష అనేది అర్హులను నిర్ణయించే ఒక ప్రక్రియ. పలానా ఉద్యోగానికి సదరు వ్యక్తులు అర్హులో కాదో అనేది పోటీ పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు. అందుకే పరీక్షలు కఠినంగా నిర్వహిస్తారు. ఎవరూ మాస కాపీయింగ్ కి పాల్పడకుండా నిర్వహిస్తారు. బాగా చదువుకున్న వాళ్ళకి, అస్సలు చదవకుండా చూసి రాసే వాళ్ళకి ఒకేలా మార్కులు వస్తే అర్హులకు అన్యాయం జరుగుతుందని కఠినంగా నిర్వహిస్తారు. అయితే ఎంత కఠినంగా ఉన్నప్పటికీ చూసి రాసే వాళ్ళు రాస్తూనే ఉన్నారు. అలా కాపీ కొడుతూ […]
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. అసలు సచివాలయ వ్యవస్థ వల్ల వచ్చిన మార్పు ఏంటి? ఈ వ్యవస్థ ద్వారా తాము సాధించిన విజయాలేంటో ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ సేవలు అందించడంలో వాలంటీర్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తున్నట్లు అభిప్రాయ పడ్డారు. ఈ వ్యవస్థ ద్వారా 1.34 లక్షల పర్మినెంట్ జాబ్స్, 2.65 లక్షల మంది వాలంటీర్లు ప్రభుత్వంలో భాగస్వాములయ్యారని.. ప్రజలకు సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా […]
ఏపీ సర్కార్ గ్రామ సచివాలయం పేరుతో ఓ కొత్త అడుగుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సచివాలయంలో ఎలాంటి సమస్య గురించి అయినా దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యకు పరిష్కారం చూపుతామని ప్రభుత్వం చెప్పింది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నా అలా సచివాలయాలు లేక అద్దె భవనాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇలా అద్దెకు తీసుకున్న భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక ఇంతటితో […]
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి యూనిఫాం, 4జీ సిమ్ కార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీలకు ఒక్కోకరికి మూడు జతల యూనిఫాంను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. నియోజకవర్గాల వారిగా యూనిఫాం క్లాత్ ను సరఫరా చేసే బాధ్యతలను రెండు సంస్థలకు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీలకు 4జీ సిమ్ కార్డులు అందించేందుకు 4 నెట్ వర్క్ లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు 2 గ్రామ సచివాలయం మూతపడింది. అద్దె చెల్లించలేదని యజమాని తాళం వేశారు. ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన ఉద్యోగులు చేసేదేమీ లేక ఆ సచివాలయం బయటే కుర్చీలేసుకుని కూర్చున్నారు. గత ఆరు నెలలుగా అద్దె చెల్లించాలని ఎంతగా అడుగుతున్నా.. అధికారుల్లో ఏ మాత్రం మార్పు లేకపోవడం విసుగెత్తిన ఇంటి ఓనర్ ఏకంగా గ్రామ సచివాలయానికే తాళం వేశాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు 2 గ్రామ సచివాలయం […]