‘షెల్డన్ జాక్సన్..‘ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇతడో సంచలనం. కానీ అతడి పేరు చాలా మందికి తెలీదు. ఇప్పటి వరకు అన్ని క్రికెట్ ఫార్మాట్లలో కలిపి 10,000కి పైగా పరుగులు చేశాడు. అయినా భారత జట్టు తరుపున అరంగ్రేటం చేయలేకపోయాడు. అటు ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇటు రంజీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. తాజాగా, విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో సెంచరీతో చెలరేగాడు. వచ్చిన బ్యాటర్లు.. వచ్చినట్లుగా పెవిలియన్ చేరుతున్నా.. తాను మాత్రం ఒంటరి […]
టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్ బెస్ట్ ఫామ్‌లో కొనసాగుతున్న రుతురాజ్.. దేశవాళీ టోర్నీల్లో ప్రతిష్టాత్మకమైన విజయ్ హజారే ట్రోఫీలో సంచలనం సృష్టించాడు. ఇప్పటి వరకు దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కూడా దరిదాపుల్లోకి వెళ్లని రికార్డును లిఖించాడు. విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్‌లో ఒక ఆటగాడు ఇప్పటి వరకు కేవలం 4 సెంచరీలు చేయడమే అత్యధికం. అలాంటిది ఏకంగా 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ బాది కొత్త […]
టీమిండియా క్రికెటర్లకు ఒకప్పుడు ఫేవరెట్ ప్లేయర్ అంటే సచిన్ మాత్రమే. తరం మారిన తర్వాత ఆ ప్లేసులోకి ధోనీ వచ్చాడు. ఇక మహీ రిటైర్ అయిన తర్వాత ఆ రేంజ్ ప్లేయర్ జట్టులో కనిపించలేదనే చెప్పాలి. ఏదైనా సరే సచిన్ అద్భుతమైన బ్యాటర్. ఆయన్ని అస్సలు తక్కువ చేయలేం. ఇక కెప్టెన్ – వికెట్ కీపర్ గా తనదైన ముద్ర వేసిన ధోనీ… చాలామంది క్రికెటర్లకు స్పూర్తిగా నిలిచాడు. ఆ విషయాన్ని సదరు ఆటగాళ్లు పలు సందర్భాల్లో […]
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ.. తన అల్లరి చేష్టలతో, ఓవర్ కాన్ఫిడెన్స్ కామెంట్లతో.. విమర్శల పాలైన యువ క్రికెటర్ రియాన్ పరాగ్. నునూగు మీసాలతో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగల రియాన్ పరాగ్ ఐపీఎల్ 2022లో మంచి ప్రదర్శనలు చేశాడు. అలాగే పలు అతి వాఖ్యలతో క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యాడు. కానీ.. దేశవాళీ టోర్నీలో మాత్రం రియాన్ దుమ్ములేపాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం అదరగొట్టిన రియాన్.. జమ్మూ కశ్మీర్‌తో […]
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు సాధించి 8 మ్యాచ్‌ల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎలాగైన సత్తా చాటాలని ఆ జట్టు యాజమాన్యం గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే.. ఐపీఎల్ 2023 కోసం ఇప్పటి నుంచే పగడ్బంధి ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. తాజా రిటేషన్ విధానంలో పలువురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో […]
క్రికెట్ చరిత్రలోనే సంచలనం నమోదైంది. ఒకటి కాదు రెండు.. ఏకంగా 7 సిక్సులు వరుసగా కొట్టి.. టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన యువరాజ్ రికార్డును దేశవాళీ క్రికెట్‌లో రుతురాజ్ బద్దలు కొట్టాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులతో పాటు నో బాల్ రూపంలో అదనంగా వచ్చిన బంతిని సైతం రుతురాజ్ స్టాండ్స్‌లోకి పంపించాడు. […]