నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మర్రిపాడులోని ఆయన నివాసంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురైయ్యారు. దాంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నెల్లూరు లోని అపోలో ఆస్పత్రికి ఆయనను తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెలోని రెండు వాల్వ్ లు మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 2019లో వైసీపీ తరపున ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు చంద్రశేఖర్ రెడ్డి. కాగా ఇటీవల గుండెపోటుతో మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డికి బాబాయ్ అవుతారు […]
ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తరచు వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఓ యువకుడి విషయంలో వార్తల్లో నిలిచారు. అంతేకాక ఇటీవల నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయ్ రెడ్డిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరిశీలకుడిగా వచ్చిన వ్యక్తి నియోజకవర్గంలో అసంతృప్తి వర్గాన్ని రెచ్చగొడుతున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇలా తరచూ ఆసక్తికర వ్యాఖ్యలతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ‘గడపగడపకు మన ప్రభుత్వం’ అనే […]
రాజరికపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యం ఉదయగిరి. విజయనగర సామ్రాజ్యంలోనూ.. ఒడిశా గజపతి రాజుల పాలనలోనూ ఈ ప్రాంతం ఎంతో గొప్పగా విరాజిల్లింది. నేడు రాజులు, రాజ్యాలు పోయినా.. ఉదయగిరి అన్న పేరులో గాంభీర్యం తగ్గలేదు. నాటి రాజుల రాజరికానికి సాక్ష్యాలుగా నిలిచే కోట.. పల్లవులు, చోళుల దైవ భక్తికి సాక్ష్యంగా నిలిచే గుళ్లు.. పలు పురాతన కట్టడాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో వజ్రవైఢూర్యాలు, బంగారు సంపద పుష్కలంగా ఉండేదని ప్రతీతి. […]
Udayagiri: రాజరికపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యం ఉదయగిరి. విజయనగర సామ్రాజ్యంలోనూ.. ఒడిశా గజపతి రాజుల పాలనలోనూ ఈ ప్రాంతం ఎంతో గొప్పగా విరాజిల్లింది. నేడు రాజులు, రాజ్యాలు పోయినా.. ఉదయగిరి అన్న పేరులో గాంభీర్యం తగ్గలేదు. నాటి రాజుల రాజరికానికి సాక్ష్యాలుగా నిలిచే కోట.. పల్లవులు, చోళుల దైవ భక్తికి సాక్ష్యంగా నిలిచే గుళ్లు.. పలు పురాతన కట్టడాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో వజ్రవైఢూర్యాలు, బంగారు సంపద పుష్కలంగా ఉండేదని […]
నెల్లూరు జిల్లా బంగారు, రాగి నిల్వలు ఉన్నట్లు జియోలాజికగల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఉదయగిరి మండలం మాసాయి పేటలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారంతో పాటు రాగి నిల్వలు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక్కడి పరిసరాల్లోని ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సేకరించారు. మాసాయి పేట పరిసర ప్రాంతాల్లో 2వేల హెక్టార్లకు పైగా నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో […]