ఇండోర్, హోల్కార్ స్టేడియం వేదికగా జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో సఫారీ ఆటగాళ్లు చెలరేగి ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 30 పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (3) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిలీ రోసో, డికాక్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. అయితే.. ఈ మ్యాచులో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ సౌతాఫ్రికా బ్యాటర్ […]
క్రీడాభిమానులు రెండు వైపులా పదునున్న కత్తి లాంటి వాళ్లు. మంచిగా ఆడితే ఆకాశానికి ఎత్తేస్తారు.. పొరపాటున అతడి వల్లే మ్యాచ్ ఓడిపోతే మాత్రం దారుణంగా తిడతారు. అదీ కాక ట్రోల్స్ ఉండనే ఉన్నాయి. ఈ విషయం టీమిండియా బౌలర్ అయిన అర్షదీప్ సింగ్ కు ఈ మధ్యే తెలిసి వచ్చింది. పాక్ తో మ్యాచ్ లో సింపుల్ క్యాచ్ వదిలేసి.. టీమిండియా ఓటమికి కారణం అయ్యాడని అతడిని దారుణంగా విమర్శించారు. ఆ విమర్శలకు తాజాగా తన బంతితోనే […]
IPL..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా పేరొందింది. ఇక ఐపీఎల్ పుణ్యామాని మరికొన్ని దేశాలు తమ దేశాల్లో ఇలాంటి పొట్టి క్రికెట్ ను నిర్వహించాడానికి ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికా కూడా “సౌతాఫ్రికా టీ20 లీగ్” పేరుతో ఓ టీ20 టోర్నీని వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనుంది. దానికి సంబంధించి ఇప్పటికే వేలం పాటలను కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ వేలం పాటలో వినిపిస్తోన్న పేరు కావ్య మారన్.. తన అందం.. అభినయం.. తన […]
అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. బ్యాటర్లు, బౌలర్లు, హిట్టర్లు, ఆల్‌రౌండర్లతో కూడిన సమతూకమైన 15 మందిని ఎంపిక చేసింది. టెంబా బావుమా జట్టును నడిపించనుండగా.. గాయంతో కీలక ఆటగాడు వాండర్ డుసెన్ దూరమయ్యాడు. అతని స్థానంలో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన ట్రిస్టన్ స్టబ్స్ ను ఎంపిక చేశారు. బ్యాటింగ్ లో క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్, […]
క్రికెట్‌లో బ్యాటర్లు, బౌలర్లే కాదు.. కొన్నిసార్లు ఫీల్డర్లు కూడా మ్యాచ్ టర్నింగ్ అద్భుతాలు విన్యాసాలు చేస్తుంటారు. తమ ఫీల్డింగ్ ఎఫర్ట్స్‌తో పరుగులను ఆపుతూ.. క్యాచ్‌లు తీసుకుంటూ విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటారు. కొన్నిసార్లు కొన్ని క్యాచ్‌లు అద్భుతంగా అనిపిస్తాయి. ‘వావ్.. భలే పట్టాడు’‘ఏం పట్టాడు రా క్యాచ్’ అంటూ క్రికెట్ అభిమానులు చర్చించుకుంటారు. మరికొన్ని సార్లు కొన్ని క్యాచ్‌లు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలుస్తాయి. కానీ.. తాజా సౌతాఫ్రికా క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్ పట్టిన ఒక క్యాచ్ మాత్రం.. ఇప్పటి […]
బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో ఇంగ్లండ్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లు జానీ బెయిర్‌స్టో(90), మొయిన్ అలీ(52) పరుగులతో చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ టార్గెట్‌ను ప్రొటీస్ ముందు ఉంచింది. ఈ భారీ స్కోర్ ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా ఆరంభంలో తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ టాప్లీ దెబ్బకు ఓపెనర్ […]