"తెలుగు ఇండియన్ ఐడల్2" షోకి నటసింహం బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇక ఈ షోలో తనదైన శైలిలో నవ్వులు పూయించారు బాలయ్య. నవదీప్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావు అంటూ స్టేజ్ పైనే పరువు తీశారు బాలయ్య. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజయవంతంగా దూసుకుపోతోంది. దేశ నలుమూలల్లో ఎక్కడెక్కడో దాగి ఉన్న ప్రతిభావంతులను ఈ ప్రోగ్రామ్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తెలుగు ఓటిటి ఆహాలో ప్రసారమవుతున్న ఈ తెలుగు ఇండియన్ ఐడల్ లో.. రోజురోజుకూ కొత్త కొత్త పెర్ఫార్మన్స్ లతో పాటు ఎమోషనల్ మూమెంట్స్, ఇన్స్పైరింగ్ మూమెంట్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి.