ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఛాతి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం.. వైద్యులు గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ విషయంపై స్పందించిన డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. కాగా, ఎమ్మెల్యే ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన […]