తూర్పు గోదావరి జిల్లా అనపర్తి దేవీ చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన భారీ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేయగా.. వాగ్వాదం నెలకొంది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం… ప్రస్తుత ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్ గా మారింది. వర్సిటీ పేరు మార్చే బిల్లుకు ఏపీ అసెంబ్లీ, బుధవారం ఆమోదం తెలిపింది. అయితే జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష తెదేపా నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ ఈ విషయమై ట్వీట్ చేయగా, అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ‘ఎన్టీఆర్, వైఎస్ఆర్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా.. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రిలీజ్ అయిన మొదటి షో నుండే భిన్నమైన టాక్ వచ్చినప్పటికీ, టాక్ కి భిన్నంగా రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బ్యాంకు వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, లోన్స్ విషయంలో డబ్బున్నోళ్లకు, పేదలకు మధ్య బ్యాంకులు చూపించే వ్యత్యాసాలను తెరపై ఆవిష్కరించింది. అదేవిధంగా […]
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇరు పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఏపిలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా ఇటీవల మంత్రి హూదా లభించింది. మొదటి నుంచి టీడీపీ అంటే మండిపడే మంత్రి రోజా తాజాగా మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేని లోకేష్ చీర కట్టుకుంటే బాగుంటుంది.. ఏ […]
మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెదేపా మహిళా కార్యకర్తలు ముట్టడించారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయం వద్ద మహిళలు నిరసనకు దిగారు. ఈ సందర్బంగా మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే అనిత ప్రశ్నించారు. తమను కమిషన్ కార్యాలయంలోకి అనుమతిచకపోతే ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మనే కిందకు రావాలని […]
సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహణతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గుడివాడ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గుడివాడ క్యాసినో విషయంలో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ నేడు గుడివాడ చేరుకుంది. మొదట టీడీపీ కార్యాలయానికి చేరుకుని.. ఆ తర్వాత క్యాసినో నిర్వహించిన ప్రాతాన్ని పరిశీలించేందుకు వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారికి కన్వెన్షన్ ప్రాంతాన్ని సందర్శించేందుకు […]
అనంతపురం- హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ నియోజకవర్గం హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలయ్య ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో హిందూపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో డంపింగ్ యార్డ్ మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి : పుష్పరాజ్ గా.. తొడగొట్టి మరీ డైలాగ్ అదరగొట్టిన బాలయ్య! హిందూపురంలోని డంపింగ్ యార్డును ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతానికి తరలించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇరుపక్షాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి శుక్రవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింహాచలం ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ధర్మకర్తలు ధర్మానికి కట్టుబడి సంప్రదాయాలు కొనసాగించాలన్నారు. సింహాచలం ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయన్న మాట […]