విజయవాడ జాతీయ రహదారిపై ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్.. అదుపుతప్పి బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కూడలి వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పింది. రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గ్యాస్ ట్యాంకర్ కావడంతో గ్యాస్ లీక్ అవుతుందని, ఆపై పేలుతుందేమోనని అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. ట్యాంకర్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. […]
ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్‌లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. నిన్న కూడా ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది. దూరాల నుంచి రావాల్సిన ట్యాంకర్లు ఆలస్యమయితే ఆస్పత్రుల్లో టెన్షన్ మొదలయిపోతోంది. కొందరి నిర్లక్ష్యం విలువైన ప్రాణవాయువును సైతం పీల్చిపిప్పి చేస్తోంది. చూస్తుండగానే లీటర్ల లీటర్ల ఆక్సిజన్ గాలో […]