చెన్నై (నేషనల్ డెస్క్)- తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయలలిత లేకుండా తమిళనాడులో ఈ సారి ఎన్నికలు జరిగాయి. సుమారు పదేళ్ల పాటు అధికారానికి దూరమైన డీఎంకే.. ఈసారి ఎట్టకేలకు విజయతీరాలను తాకింది. అటు అధికార అన్నాడీఎంకే గట్టిపోటీయే ఇచ్చినా, డీఎంకే స్పష్టమైన మెజార్టీ వచ్చింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకుగానూ డీఎంకే కూటమి 157 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కొళ్లత్తూరు నుంచి పోటీచేసిన డీఎంకే […]