ప్రముఖ హీరో విశాల్ కు హైకోర్టు షాకిచ్చింది. ఓ కేసు విషయమై రూ.15 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాల్సిందేనని ఆదేశించింది. అప్పటివరకు విశాల్ చిత్రాలపై నిషేధం కూడా విధించింది.
ఈమధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. గుండెపోటుకు గురవుతున్నారు. ఇక తాజాగా ప్రముఖ గాయని ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఆ వివరాలు..
నేటి కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే.. ఈ సమాజంలో ఆడవాళ్లు.. గౌరవంగా బతకాలనుకోవడం అత్యాశే అనిపిస్తోంది. కుటుంబ పోషణ కోసమే, ఆర్థిక ఇబ్బందుల కారణంగానో.. ఆడవారు పని చేయాల్సి వస్తోంది. కానీ పని చేసే చోట వారు ఎన్నో వేధింపులకు గురవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇవి మరి కాస్త ఎక్కువ. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి వెల్లడించారు. తాజాగా మరో నటి ఈ జాబితాలో చేరారు. ఆ వివరాలు..
ప్రముఖ హాస్యనటుడు వడివేలు ఇంట్లో విషాదం నెలకొంది. పేరుకే తమిళ నటుడు అయినప్పటికీ.. తెలుగులోనూ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్స్ లో ఈయన ఒకడు. తన మేనరిజంకు స్పెషల్ అభిమానులు చాలామందే ఉన్నారు. అయితే పలు కారణాల వల్ల వడివేలుపై తమిళ ఇండస్ట్రీలో నిషేధం విధించారు. దీంతో ఈయన కొన్నేళ్లపాటు సినిమాల్లో నటించలేదు. కొన్నాళ్ల ముందే రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. గతేడాది చివర్లో ‘నాయి శేఖర్ రిటర్న్స్’ చిత్రంతో […]
నటీనటులకు అభిమానులు లక్షలు, కోట్లల్లో ఉంటారు. వీళ్లతో ఎంత మంచిదో అంతా డేంజర్ కూడా. ఎందుకంటే తమ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ కోసం ఏం చేసేందుకైనా సరే రెడీగా ఉంటారు. ఇక వాళ్ల ఫేవరెట్ యాక్టర్ ని మీరు గానీ ట్రోల్ చేస్తే మాత్రం మీ పని అయిపోయినట్లే. ఫ్యాన్ వార్స్ మొదలుపెడతారు. మీరు క్షమాపణ చెప్పేవరకు అస్సలు వదలరు. ఇదంతా నాణానికి ఓవైపు. మరోవైపు కొందరు వ్యక్తులు.. అభిమానుల పేరు చెప్పుకుని మోసాలు చేస్తుంటారు. […]
దక్షినాది సీనియర్ నటి కస్తూరి.. పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య సినిమా ద్వారా తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకుంది. అన్నమయ్య సినిమాకంటే ముందు.. ఆ తర్వాత కస్తూరి చాలా సినిమాలే చేసింది. కానీ అన్నమయ్య సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఫామ్ లో ఉన్నప్పుడు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ సీనియర్ నటి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సీరియల్ నటిగా రాణిస్తోంది. అయితే.. సినిమా ఇండస్ట్రీ అంటే వివాదాలు, […]
ఫిల్మ్ డెస్క్- కోవై సరళ.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కామేడీ పాత్రలకు పెట్టింది పేరు కోవై సరళ. అందులోను తెలుగు కామెడీ స్టార్ బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. కోవై సరళ ఇప్పటిదాకా దాదాపు 750 సినిమాల్లో నటించారు. ఎంజీఆర్ సినిమాలను చూసి సినిమాల్లో నటించాలని కోరికతో ఈ రంగంలోకి వచ్చారట కోవై సరళ. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ హాస్యనటి పురస్కారాలను […]