చాక్లెట్ అంటే ప్రేమకు గుర్తు. అంతే కాదు – చాక్లెట్‌లోని స్వీట్‌నెస్‌ని జీవితంలోనూ షేర్ చేసుకోవడం అని కూడా అర్థం. చాక్లెట్ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది చాక్లెట్. చాక్లెట్ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. చాక్లెట్ వచ్చే చెట్టు శాస్ర్తియ నామం థియోబ్రామా కకావ్. […]
ఎక్కడో ఉత్తరాంధ్రజిల్లా మారుమూల గ్రామం మాడుగుల. అయితే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యింది. అదీ ఓ స్వీట్ తయారీ వల్ల. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే మిఠాయి హల్వాకు అంత గుర్తింపొచ్చింది. 1890లో ఒక మిఠాయి వ్యాపారి దీనిని తయారు చేశారు. ఇప్పుడు అమెరికా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, అస్ట్రేలియా., ఇలా 20 దేశాల ప్రజలకు మాడుగుల హల్వా రుచి తెలుసు. మాడుగుల నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్లు ఈ హల్వాను తీసుకెళ్లడంతో విదేశాల్లో సైతం […]