ఈ మధ్యకాలంలో విమానాల్లో కొందరు ప్రయాణికులు శ్రుతి మించి అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తోటి ప్రయాణికులతో ర్యాష్ ప్రవర్తిస్తున్నారు. అంతేకాక విమానంలో పనిచేసే మహిళ సిబ్బందిపై కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే విమానంలో ఓ ప్రయాణికుడు.. పక్కనే ఉన్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. తాజాగా ఓ ఎయిర్ హోస్టస్ పై మరో ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు.