నిర్మాత బన్నీ వాస్ పై.. మిస్ సునీత బోయ అనే అమ్మాయి గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.., ఇన్నాళ్లు ఈ విషయంపై నేరుగా స్పందించని బన్నీ వాస్ తొలిసారి స్పందించారు. ఈ నేపధ్యంలోనే బన్నీ వాసు వెర్షన్ ని తెలియజేస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. “2019 నుంచి ఇప్పటి వరకు సునీత బోయ.. గీతా ఆర్ట్స్ సంస్థ.. అలాగే నిర్మాత బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. […]
తెలుగు చలనచిత్ర రంగంలో “మీ టూ” రేపిన ప్రకంపనలు అంతాఇంతా కాదు. ఆ సమయంలోనే శ్రీరెడ్డి అనే ఓ సాధారణ నటి.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమెకి జరిగిన అన్యాయాన్ని పక్కన పెడితే.., అప్పట్లో ఆమె వ్యవహరించిన తీరు మాత్రం ఎవ్వరూ మరచిపోలేరు. ఇక ఇదే తరహాలో కొంత మంది నటీమణులు చాలా మంది సెలబ్రెటీలపై ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. ఇలాంటి వారిలో సునీత బోయ ఒకరు. […]