ఫేమస్ అయ్యేందుకు ఏకంగా నోటికొచ్చిన అబద్దాలు చెబుతాడు. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాకు తానే మొదట హీరోనని, ఆ తర్వాత మహేష్ బాబుకు అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ శాక్రిఫైజ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క సినిమా చేయలేదు కానీ సోషల్ మీడియా, పలు ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ హీరోలను టార్గెట్ చేశాడు.
నెగెటివ్ కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ తెచ్చుకున్నాడు సునిశిత్. ఇటీవలే చరణ్ సతీమణి ఉపాసన గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మెగా ఫ్యాన్స్ చేతిలో చావు దెబ్బలు తిన్న సునిశిత్.. తాజాగా మరో టాప్ హీరో ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది సామాన్యులు తమ టాలెంట్ తో రాత్రికి రాత్రే సెలబ్రెటీాలు గా మారిపోతున్నారు. మరికొంతమంది తమ వింత ప్రదర్శనలు, కాంటవర్సీలు క్రియేట్ చేస్తూ పబ్లిసిటి తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఒకరు.
వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సునిశిత్‌పై రామ్ చరణ్ ఫ్యాన్స్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ఆ విషయం తెలిసిన వారు అద్గది రామ్ చరణ్ ఫ్యాన్ అంటూ కామెంట్స్ చేశారు.
శాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌పై రామ్‌చరణ్ ఫ్యాన్స్ దాడి చేశారు. సునిశిత్ ఇంటి దగ్గరకు వెళ్లి మరీ అతడిపై దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.