ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా పీఎస్‌ఎల్వీ సీ-53 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. గురువారం సాయంత్రం 6.02గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ53.. కౌంట్ డౌన్ 26గంటల పాటు కొనసాగిన తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు వాణిజ్య ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్వీ సీ53 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోదన సంస్థ ఇస్రో మరోసారి తన […]