దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్ అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వినూత్న శివాలయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
జీవితంలో అంచెలంచలుగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరూ మరో వైపునుంచి ప్రమాదాలకి దగ్గరగా వెళుతూ వుంటారు. ఎందుకంటే వారి ఎదుగుదలను చూసి సహించలేని వాళ్లు, శత్రువులుగా మారుతుంటారు. ఇలాంటి వాళ్లు అవతలి వ్యక్తులను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. కుదరకపోతే ప్రాణాలకే హాని తలపెడుతుంటారు. ఇలాగే అడిగిన సాయం చేయలేదనీ, తమకు రావలసిన దానిని చేజిక్కించు కున్నారని శత్రువులు తయారవుతూ వుంటారు. ఊహించడం జరగదు కనుక, ఇలాంటి వారి బారి నుంచి ఆ పరమశివుడే రక్షించవలసి వుంటుంది. అందుకే ఆదిదేవుడికి […]