హైదరాబాద్ నగర నడిబొడ్డున 125 అడుగుల రవికిరణం, ఆశాకిరణం అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి ఈ విగ్రహాన్ని తయారు చేసింది ఎవరో తెలుసా?
ఆర్ట్ ప్రదర్శనల్లో ఉంచే పెయింటింగ్స్, కళారూపాలను చూసేందుకు ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రదర్శనలు జరిగినప్పుడు వెళ్తుంటారు. అలాంటి ఓ ప్రోగ్రామ్‌కు వెళ్లిన వృద్ధురాలు చేసిన పనికి ఓ విలువైన బొమ్మ ధ్వంసమైంది.
మానవ చరిత్రను తెలుసుకోవడానికి పుస్తకాలు, శాసనాలు బాగా ఉపయోగపడతాయి. అదే మన వైభవం, ఆచార వ్యవహారాలు తెలుసుకునేందుకు మాత్రం శిల్ప సంపద లాంటివి ఉండాల్సిందే. అందుకే అరుదైన శిల్పాలు దొరికినప్పుడు వాటిని పరిశీలించి, చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా భద్రపరుస్తుంటారు. ఇలాంటి శిల్పాలను కనుగొనేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చేసే కృషి ప్రశంసనీయమనే చెప్పాలి. వాళ్ల కృషి వల్లే చరిత్రలో మరుగున పడిన ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి. ఇదిలాఉంటే.. తెలంగాణలోనే అతిపెద్ద ద్వారపాలకుడి శిల్పం తాజాగా బయటపడింది. […]
భారత గానకోకిల లతా మంగేష్కర్.. శాశ్వతంగా కనుమూయడంతో సంగీత ప్రపంచం మూగబోయింది. కొన్ని దశాబ్దాలుగా లతా మంగేష్కర్ తన మధురమైన గాత్రంతో సినీలోకాన్ని, సంగీత ప్రియులను అలరిస్తూ వచ్చారు. నిన్నటితో ఆమె శకం ముగియడంతో.. ఆమె అభిమానులంతా బాధాతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడిన లతా మంగేష్కర్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించని వారులేరు. ఇక ఆమె మృతికి నివాళి అర్పిస్తూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. లతా మంగేష్కర్ సైకత శిల్పాన్ని […]
చేతులు కట్టుకుని నిలుచున్న వ్యక్తి పేరు – సాల్వటోర్ గారౌ . శిల్పం ఖరీదు రూ. 13 లక్షలు. శిల్పమేదీ అనుకుంటున్నారా అతను శూన్యాన్నే అమ్మాడు. నిజమే ఇక్కడ శిల్పం లేదు. ఎందుకంటే అది అదృశ్య శిల్పం! అయితే దానికి ధర అతని మాటలవల్ల వచ్చింది. ఇటలీకి చెందిన సాల్వటోర్ గారౌ 150 సెం.మీ వెడల్పు, 150 సెం.మీ పొడవు ఉండే ఓ రాతిని ‘నేను’ అనే శిల్పంగా అభివర్ణించాడు. దేవుడికి రూపం లేన ట్లుగానే మనిషికి, […]