ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. మైనర్లు సైతం తుపాకీలతో రెచ్చిపోతున్నారు. కొంతమంది క్లాస్ రూమ్స్ లోకి తుపాకీలు తీసుకు వచ్చి తోటి విద్యార్థులను బెదిరిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
మైనర్లు తల్లిదండ్రుల కళ్లు కప్పి స్మోకింగ్, మద్యం సేవించడం వంటి పనులను చేస్తున్నారు. తల్లిదండ్రులను, టీచర్లను మభ్య పెట్టి పాఠశాలలకు హాజరుకాకుండా సినిమాలు, షికార్లు చేయడంతో పాటు వ్యవసనాలకు బానిసలవుతున్నారు. తాజాగా అకారణంగా ఓ విద్యార్థిని పొట్టనబెట్టుకున్నారు తోటి విద్యార్థులు.
గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. భోజనం చేసి పుస్తకం తీద్దామని అనుకున్నాడు. మాయదారి గుండెపోటు ఆ కుర్రాడ్ని తీసుకెళ్ళిపోయింది.
పిల్లలందరూ ఒకేలా ఉంటారా? ఒకరు బాగా చదువుతారు, మరొకరు యావరేజ్ గా చదువుతారు. ముఖ్యంగా కొంతమంది చిన్న పిల్లలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. పాఠాలు గుర్తుపెట్టుకోవడం లేదని ఒక టీచర్ బాలుడ్ని చచ్చేలా కొట్టాడు.
ఇటీవల జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) ప్రపంచంలో తెలివైన విద్యార్థి ఎవరన్న ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ లో 76 దేశాలకు చెందిన 15 వేలకు మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా.. ఓ బాలిక తెలివైన విద్యార్థిగా ఎన్నికైంది.
ఈ మద్య పలు స్కూల్స్, కాలేజీల్లో టీచర్లు ర్యాంకులు రావాలని విద్యార్థులను కఠినంగా శిక్షిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే పనిష్ మెంట్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి.. కొన్నిసార్లు విద్యార్థులు ప్రాణాలు కూడ కోల్పోతున్నారు.. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
తల్లిదండ్రుల తర్వాత గురువుకు ప్రాధాన్యతనిస్తాం. వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రుల దగ్గర గారాబం వల్ల నేర్చుకోలేని చిన్న చిన్న పనులు, మన కాళ్లపై మనమే నిలబడాలన్న పాఠాలు గురువుల దగ్గరి నుండే నేర్చుకుంటాం. జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొవాలో, విజయం ఎలా సాధించాలో నేర్పేదీ కూడా గురువే. అలాంటి గురువుపై దాడి చేశాడో విద్యార్థి.
గతంలో విద్యార్థులు టీచర్ కనపడగానే ఆమడదూరం పరిగెత్తేవారు. ఏమంటాడో అన్న భయం ఒకటైతే.. రేపు స్కూల్ కు వెళ్తే ఎన్ని దెబ్బలు వేస్తాడో అన్న టెన్షన్ మరోవైపు. కానీ, ఇప్పటి పిల్లలు అలా కాదు. టీచర్ తిట్టినా ఇంట్లో చెప్పడమే.. కొట్టినా ఇంట్లో చెప్పడమే. ఇది చెప్పగానే తల్లిదండ్రులు..'ఆ ఎవర్రా..? నిన్ను కొట్టింది పదా ఆ టీచర్ ఎవరో చూపిద్దువు గానీ వాడి హంతు తేలుద్దాం..' అంటూ బయలుదేరుతున్నారు.
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్.. విద్యార్థిని పట్ల క్రూరంగా వ్యవహరించింది. 5వ తరగతి చదువుతున్న బాలికపై కత్తెరతో దాడి చేయడమే కాకుండా ఆ బాలికను స్కూల్ మెుదటి అంతస్తు నుంచి కింద పడేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఆధీనంలో పనిచేస్తున్న నగర్ నిగమ్ బాలికా విద్యాలయంలో శుక్రవారం ఉదయం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. […]
ఈమధ్య కాలంలో.. గుండెపోటుకు గురై.. ఆకస్మాత్తుగా మృతి చెందుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే ఆశ్చర్యం కొద్ది చిన్నారులు కూడా ఇలా గుండెపోటు బారిన పడటం కలవర పెడుతోంది. కొన్ని రోజుల క్రితం స్కూల్ ప్రార్థనలో ఉన్న బాలుడు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యి.. కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ కోవకు చెందిన సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. స్కూల్ అయిపోయి.. ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన కుర్రాడు.. కార్డియాక్ అరెస్ట్‌కు గురయి మృతి చెందాడు. ఈ […]